హలో అబ్బాయిలు.. వారానికి ఒక్కసారి ఇలా చేస్తే యవ్వనమైన మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది!

అందంగా కనిపించాలని అమ్మాయిలే కాదు అబ్బాయిలు ( Men ) సైతం కోరుకుంటారు.అమ్మాయిలకు మాదిరిగానే అబ్బాయిల కోసం కూడా మార్కెట్లో ఎన్నో రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి.

 Doing This Once A Week Will Give You A Youthful Glowing Skin Details, Youthful-TeluguStop.com

అయితే రసాయనాలతో కూడిన ఉత్పత్తులను వాడటం కంటే సహజ పద్ధతిలో చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడం చాలా ఉత్తమం.ముఖ్యంగా అబ్బాయిల కోసం ఒక అద్భుతమైన రెమెడీ ఉంది.

ఈ రెమెడీని వారానికి ఒక్కసారి పాటించారంటే యవ్వనమైన మెరిసే చర్మం( Youthful Glowing Skin ) మీ సొంతం అవుతుంది.మరి ఇంతకీ మగవారి అందాన్ని పెంచే ఆ రెమెడీ గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో సన్నగా తరిగిన కొన్ని కొబ్బరి ముక్కలను( Coconut ) వేసి వాటర్ సాయంతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి,( Rice Flour ) వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Coconut, Skin, Remedy, Skin Care, Skin Care Tips, Youthful Skin-Tel

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేసుకుంటూ గోరువెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.అబ్బాయిలు వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.

ప్రధానంగా పచ్చి కొబ్బరి స్కిన్ ఏజింగ్‌ ను ఆలస్యం చేస్తుంది.ముడతలు రాకుండా అడ్డుకుంటుంది.

చర్మాన్ని టైట్‌గా మారుస్తుంది.

Telugu Tips, Coconut, Skin, Remedy, Skin Care, Skin Care Tips, Youthful Skin-Tel

అలాగే బియ్యం పిండి, చందనం పొడి చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి.స్కిన్ గ్లోయింగ్ గా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.పెరుగు చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.

చర్మంలో తేమను లాక్ చేసి డ్రై స్కిన్ సమస్యకు చెక్ పెడుతుంది.ఇక లెమన్ జ్యూస్ మచ్చల నివారణకు అద్భుతంగా తోడ్పడుతుంది.

అదే సమయంలో మొటిమలను కంట్రోల్ చేస్తుంది.స్కిన్ ను బ్రైట్ గా సైతం మెరిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube