ఈ వర్షాకాలంలో( Monsoon ) ఎప్పుడు వర్షం పడుతుందో.ఎప్పుడు ఎండ వస్తుందో అస్సలు అంచనా వేయలేము.
అప్పుడే ఎండ.అప్పుడే వాన అన్నట్లుగా ఉంటుంది.ఇక ఈ వర్షాకాలంలో దుస్తులు( Clothes ) విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు.సరిగ్గా ఆరకపోవడం, వర్షాల్లో తడవడం తదితర కారణాల వల్ల దుస్తులు నుంచి చెడు వాసన( Musty Smell ) వస్తుంటుంది.
అటువంటి దుస్తులు వేసుకోవడం మనకే కాదు చుట్టూ ఉన్నవారికి కూడా ఇబ్బందే.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ను కనుక ఫాలో అయ్యారంటే వర్షాకాలంలో దుస్తులు నుంచి వచ్చే చెడు వాసనకు సులభంగా చెక్ పెట్టవచ్చు.
దుస్తులను వాషింగ్ మిషన్ లో వేసేటప్పుడు లేదా వాటర్ లో నానబెట్టినప్పుడు డిటర్జెంట్ తో పాటుగా ఒక కప్పు రోజ్ వాటర్( Rose Water ) మరియు నాలుగు టేబుల్ స్పూన్లు నిమ్మరసం( Lemon Juice ) కూడా వేయండి.వీటిని కలిపి బట్టలను ఉతకడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది.
నిమ్మరసం దుస్తుల్లో బ్యాక్టీరియా, ఫంగస్ చేరకుండా అడ్డుకట్ట వేస్తుంది.రోజ్ వాటర్ దుస్తులకు తాజాదనాన్ని అందిస్తుంది.
అలాగే దుస్తులు నుంచి చెడు వాసన రాకుండా ఉండాలి అనుకునేవారు వాషింగ్ మిషన్ లో డిటర్జెంట్ లేదా లిక్విడ్‌తో పాటు బేకింగ్ సోడా( Baking Soda ) మరియు వెనిగర్ ను( Vinegar ) కూడా చేర్చండి.ఇవి బట్టల నుండి దుర్వాసనను తొలగించడంలో సహాయపడటమే కాకుండా సహజంగా దుస్తులను మృదువుగా చేస్తాయి.
వర్షాకాలంలో బట్టలను కుప్పలుగా ఉంచకూడదు.ఎందుకంటే ఇది మీ బట్టలు దుర్వాసనకు గురి చేస్తుంది.చెమట, చర్మ కణాలు మరియు ఇతర శరీర ద్రవాలు మన బట్టలపై వదిలేస్తాము.వాటి వల్ల బ్యాక్టీరియా విచ్ఛిన్నమై కొన్ని వాయువులను విడుదల చేస్తుంది.కాబట్టి మీరు మీ మురికి దుస్తులను విడివిడిగా గాలికి ఆరేయండి.తద్వారా అవి కొంత గాలిని అందుకుంటాయి.చెడు వాసన రాకుండా ఉంటాయి.
వర్షాకాలంలో బట్టలు ఉతికిన తర్వాత వాటిని ఆరబెట్టడం అతిపెద్ద సమస్య.
దుస్తుల్లో కొద్దిపాటి తేమ ఉన్న స్మెల్ వచ్చేస్తాయి.అలా అని ఉతికిన బట్టలు ఆరబెట్టడానికి సూర్యుడు కనిపించే వరకు వేచి ఉండకండి.
ఎండ లేకపోతే ఫ్యాన్ గాలిలో అయిన దుస్తులను పూర్తిగా ఆరబెట్టాలి.