వాస్తు శాస్త్రంలో( Vastu Shastra ) ఎన్నో చిట్కాలు ఉన్నాయి.వాటిని పాటిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పెద్దలు చెబుతుంటారు.
ముఖ్యంగా మనం కొన్ని వస్తువులను ఇతరుల నుంచి అస్సలు తీసుకోకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.అలా తీసుకుంటే మన ఇళ్లలో డబ్బు అంతా పోతుంది.
అంతేకాకుండా ఇంట్లో మనశ్శాంతి కరువవుతుంది.అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 5 వస్తువులను తీసుకోకండి.
అవి ఏంటో తెలుసుకుందాం.ముఖ్యంగా అగ్గిపెట్టె( matchbox ).చాలా మంది ఇళ్లలో అకస్మాత్తుగా కరెంట్ పోయినప్పుడు కొవ్వొత్తి వెలిగించుకోవాలని భావిస్తుంటారు.అగ్గి పెట్టె కోసం వెతికితే అది దొరకదు.
ఒక్కోసారి గ్యాస్ లైటర్ కూడా పని చేయదు.ఇలాంటి సందర్భంలోనూ అగ్గిపెట్టె అవసరం పడుతుంది.
ఆ సమయంలో పక్కింటి వారిని అగ్గిపెట్టె అడిగి తీసుకుంటారు.ఇలా చేస్తే మీకు అశాంతి మాత్రమే మిగిల్చుతుంది.
అగ్గి పెట్టె ఇతరుల నుంచి తీసుకోకూడదు.ఇతరులకు ఇవ్వకూడదు.
ఇది అగ్నికి సంబంధించినది కాబట్టి ఇంట్లో గొడవలు పెరుగుతాయి.

కర్చీఫ్‌ను కూడా ఎవరి నుంచి తీసుకోకూడదు.మనది ఎవరికీ ఇవ్వకూడదు.ఇలా చేస్తే జీవితంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.
అంతేకాకుండా ఇంట్లోనూ మనశ్శాంతి కరువు అవుతుంది.వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు లేని వ్యక్తి నుంచి రుమాలు కూడా తీసుకోకూడదు.
ఇదే కాకుండా ఇంట్లో పెరుగు తోడు పెట్టడానికి ఇతరుల నుంచి పెరుగు కొంచెం తీసుకుంటుంది.వాస్తు శాస్త్రం ప్రకారం అది ఎవరి నుండి తీసుకోకూడదు లేదా ఇవ్వకూడదు.
పెరుగు ఉచితంగా తీసుకోవడం వల్ల ఇంట్లో అశాంతి వాతావరణం నెలకొంటుంది.ఇదే కాకుండా నల్ల నువ్వులను( Black sesame ) ఎవరికీ ఇవ్వకూడదు, ఎవరి నుంచి తీసుకోకూడదని వాస్తు శాస్త్రంలో ఉంది.
శనిగ్రహంతో నల్ల నువ్వులకు అవినాభావ సంబంధం ఉందని జ్యోతిషశాస్త్రంలో ఉంది.దీని వల్ల నల్ల నువ్వులను ఇతరుల నుంచి తీసుకున్నా ఇచ్చినా ఇంట్లో ఖర్చులు భారీగా పెరుగుతాయి.
ఇలా అనవసరమైన ఖర్చులు పెరిగి డబ్బు వృధా అవుతుంది.ముఖ్యంగా శనివారం ఈ పని అస్సలు చేయకూడదు.