మీ జీవితంలో ఎప్పుడూ అదృష్టం మీ వెంట ఉండాలంటే ఇలా చేయండి..

అదృష్టం( good luck ) ఎప్పుడు మనతో ఉండాలని చాలామంది ఆశిస్తూ ఉంటారు.దీనికోసం ఎన్నో రకాల పరిహారాలు కూడా పాటిస్తుంటారు.

 Do This If You Want Luck To Always Be With You In Your Life , Rose Petals, Good-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోవాలని, కుటుంబ కలహాలు ఉండకూడదని, ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటారు.అయితే దీని కోసం పలు చిట్కాలు కూడా అనుసరిస్తారు.

దీంతో మనకు అన్ని శుభాలు కలగడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి.అందుకే వాటిని పాటిస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి.

స్నానం చేసే సమయంలో నీటిలో కొన్ని రకాల పదార్థాలు వేసుకుంటే మంచిది.స్నానం చేసే సమయంలో నీళ్లలో పసుపు ( turmaric )వేసుకొని స్నానం చేయడం వలన మన పై ప్రతికూలతలు దూరం అవుతాయి.

అలాగే గోరు వెచ్చని నీటిలో కొద్దిగా పసుపు కలుపుకొని స్నానం చేయడం వలన మనకు శుభం కలుగుతుంది.ఇక మన ఆచార వ్యవహారాల్లో గంధం( sandalwood ) ముఖ్యమైనది.

అందుకే దీన్ని అన్ని శుభకార్యాల్లో వాడుతారు.అందుకే స్నానం చేసే సమయంలో గంధం వేసుకొని స్నానం చేయడం వలన సంపద కీర్తి వస్తుంది.

Telugu Vastu, Vastu Tips-Telugu Bhakthi

అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది.సానుకూల శక్తి కూడా పెరుగుతుంది.అంతేకాకుండా ఇది మన శరీరాన్ని చల్ల పరచడం లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.మన సాంప్రదాయంలో వేపాకు( Neem ) కు ఎంతో ప్రాధాన్యత ఉంది.

వేపాకును దేవతలతో సమానంగా కొలుస్తారు.అందుకే మనం స్నానం చేసే సమయంలో నీటిలో వేపు పువ్వు వేసుకుంటే శుభం కలుగుతుంది.

అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

Telugu Vastu, Vastu Tips-Telugu Bhakthi

ఆయుర్వేదంలో తులసికి ఎంతో విలువ ఉంది.స్నానం చేసే సమయంలో నీళ్లలో తులసి ఆకులను వేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.తులసి నూనె కూడా వేసుకొని స్నానం చేయవచ్చు.

అలాగే గులాబీ రేకులు( rose petals ) వేసుకొని స్నానం చేయడం వలన కూడా మనకు శుభాలు కలుగుతాయి.స్నానం చేసే సమయంలో వాటిని వేసుకోవడం వలన ప్రశాంతత కలుగుతుంది.

దీంతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube