చాలామంది ఎంత కష్టపడి పనిచేసిన, ఎన్ని ప్రయత్నాలు చేసినా అభివృద్ధి కాకుండా ఆస్తి గొడవలతో, అప్పుల పాలవుతూ, ఉద్యోగాలు రాక ఒకవేళ ఉద్యోగం వచ్చినా ప్రమోషన్ రాక అష్ట కష్టాలు పడుతూ ఉంటారు.అలాంటి వాటికి కారణం వారి జీవితంలో ఏలినాటి శని( Elinati Shani ) ప్రభావం ప్రభావమేనని వేద పండితులు చెబుతున్నారు.
అంటే శని పట్టుకుంటే వదలడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.వీటన్నిటికి కారణమైన శనీశ్వరుని కృపకులోనై, శని ప్రభావాన్ని తగ్గించుకుని శని దోషాలు పోగొట్టుకోవడానికి శని త్రయోదశి రోజున చేసే నివారణలు చాలా బాగా ఉపయోగపడతాయని పురాణాల్లో ఉన్నాయి.

మరి ఆ నివారణలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.శని త్రయోదశి( Shani Thrayodashi ) రోజు శనీశ్వరుని పూజించడం వల్ల అష్టమ శని కష్టాలు తొలగి ఏలినాటి శని ప్రభావం పోతుంది.దానికోసం ఆ రోజు ఉదయాన్నే నిద్ర లేచి నీటిలో ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రపరచడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరమైపోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.ఆ తర్వాత తులసి చెట్టుకు( Tulsi Pooja ) పూజ చేసి మరియు ఇంటి దేవుడికి పూజ చేయాలి.
శని త్రయోదశి రోజే గుడికి వెళ్లి అక్కడ ఉన్న నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి.ఇలా ప్రదక్షిణ చేసిన తర్వాత శని గ్రహానికి నువ్వుల నూనె, ఆముదం, కొబ్బరినూనె కలిపి తైలాభిషేకం చేయాలి.

ఆ తర్వాత అభిషేకం చేసి ఆ నువ్వుల నూనెతో నువ్వుల ఉండలు చేసి పంచి పెట్టాలి.ఆ పూజలన్నీ అయిపోయిన తర్వాత ఒక నల్ల జాకెట్ ముక్క, ఒక కేజీ నువ్వులు, ఒక కేజీ బెల్లం, 116 రూపాయలు పెట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి.ముఖ్యంగా ఆరోజు ఉపవాసం( Fasting ) ఉండి, శనీశ్వరునికి అనుకున్న పనులు సజావుగా జరగాలని, ముడుపు కట్టి సాయంత్రం వేళ ఆ ముడుపును శనీశ్వరుని ఆలయంలో ఇవ్వాలి.ఆ రోజున బ్రహ్మచర్యం పాటించడం ఎంతో ముఖ్యం.
కావున ఇటువంటి బాధలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ శని దోష నివారణ చేయడం ఎంతో మంచిది.