ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి( Stress ), కంటి నిండా నిద్ర లేకపోవడం, ధూమపానం, మద్యపానం తదితర కారణాల వల్ల చాలా మందిలో చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు తలెత్తుతున్నాయి.దీని కారణంగా ముప్పై ఏళ్లకే ముసలి వారిగా కనిపిస్తుంటారు.
కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని వారానికి కేవలం రెండు సార్లు కనుక పాటిస్తే మీ చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా మెరుస్తుంది.అరవైలోనూ మీరు సూపర్ యంగ్ గా కనిపిస్తారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ ( Orange peel powder )హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక వైట్ ను వేసి మరోసారి అన్ని కలిసేంత వరకు మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో ముఖానికి మరియు మెడకు కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.

పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి కేవలం రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే చర్మం బిగుతుగా మారుతుంది.ముడతలు, చారలు వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.చర్మం యవ్వనంగా మెరుస్తుంది.

ఈ రెమెడీని పాటిస్తూ ఉంటే వయసు పైబడిన సరే యంగ్ గా కనిపిస్తారు.అంతేకాదు ఈ రెమెడీ వల్ల మరి కొన్ని లాభాలు కూడా ఉన్నాయి.ముఖ్యంగా మొటిమల సమస్యకు అడ్డుకట్ట వేయడానికి, మొండి మచ్చలను నివారించడానికి ఈ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.
పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఈ రెమెడీని పాటించవచ్చు.మరియు ఈ రెమెడీ వల్ల చర్మం స్మూత్ అండ్ సాఫ్ట్ గా కూడా తయారవుతుంది.