ప్రతి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలగాలని ఇంటి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.దాదాపు చాలా మంది ఇళ్లలో పూజ గది( Pooja room ) కచ్చితంగా ఉంటుంది.
దేవుని కొలిచే దేవాలయానికి పూజగదికి సంబంధించిన అనేక నియమాలు పురాణ గ్రంధాలలో ఉన్నాయి.ఈ నియమాలు పాటిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ దూరమైపోతాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం రాత్రి పూట పూజ గదికి తెరవేయాలని పండితులు చెబుతున్నారు.అసలు అలా ఎందుకు చేయాలి.
దానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ మత గ్రంధాలలో ఇంటి దేవాలయానికి సంబంధించిన అనేక నియమాలు ఉన్నాయి.దేవాలయంలోకి ప్రవేశించడానికి కొన్ని నియమాలు ఉన్నట్లే ఇంటిలోని పూజ గదిలోకి వెళ్లడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.ఇంటి పూజ గదికి సంబంధించిన నియమాలను తప్పకుండా పాటిస్తే ఇంట్లో సుఖసంతోషాలు వస్తాయని పండితులు( Scholars ) చెబుతున్నారు.
పూజ గదులు వంటగదిలో కానీ, పడక గది లో కానీ ఉండకూడదు.అలాగే రాత్రి పూట పూజ గదిని మూసి ఉంచాలని పండితులు చెబుతున్నారు.

రాత్రిపూట దేవాలయాన్ని మూసి వేయడాన్ని తరచుగా మనం చూస్తూనే ఉంటాము.అలాగే ఇంట్లోని పూజ గదిని కూడా రాత్రి పూట మూసి ఉంచాలని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే మన మందరం రాత్రి సమయం లో ఎలా విశ్రాంతి తీసుకుంటామో, అలాగే పూజ గదిలో ఉన్న దేవుళ్లకు కూడా విశ్రాంతి అవసరమని నిపుణులు చెబుతున్నారు.రాత్రిపూట దేవాలయాన్ని మూసే సంప్రదాయం మత గ్రంథాలతో ముడిపడి ఉంది.
బయట వారి కళ్ళు రాత్రిపూట ఇంటిపై పడకుండా ఉండేందుకు ఎలా తలుపులు వేస్తారో, అలాగే రాత్రి సమయాలలో మనుషుల కళ్ళు దేవుడిపై పడకుండా, దేవాలయాల్లోని విగ్రహాలు కనపడకుండా పరదాలు వేయాలని నిపుణులు చెబుతున్నారు.అలాగే ఇంట్లో దేవాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రతికూల శక్తి ( Negative energy )దూరంగా వెళ్లి సానుకూల శక్తి వస్తుంది.
అలాగే ఇంట్లో దేవాలయాన్ని స్థాపించడానికి సరైన దిశను ఈశాన్యంగా చెబుతూ ఉంటారు.అలాగే దేవాలయంలో నిత్యం పూజలు జరగాలని, దేవతలకు అభిషేకం చేయాలని చెబుతూ ఉంటారు.దేవాలయంలో ప్రతిష్టించిన దేవతలకు నైవేద్యాలు కూడా క్రమం తప్పకుండా సమర్పించాలని పండితులు చెబుతున్నారు.