జ్యోతిర్లింగాల దర్శనం కోసం రైళ్ల ప్రత్యేక ప్యాకేజీ

భారత రైల్వే ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునే వారికోసం సరికొత్త టూర్‌ ప్యాకేజీతో ముందుకొచ్చింది.కొత్త ఏడాదిలో జ్యోతిర్లింగాల దర్శనం చేయాలనుకునే వారి కోసం ఈ ప్యాకేజీ తీసుకొచ్చింది.

 Irctc Jyotirlinga Darshan Train To Start On January 2022 Check Fares Routes Othe-TeluguStop.com

ఈ ప్యాకేజీ ద్వారా దేశంలోని ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు.అలాగే స్టాచ్యూ ఆఫ్ యూనిటీని కూడా సందర్శించవచ్చు.

భారత్ దర్శన్ స్పెషల్ టూరిస్ట్ రైలు దేశంలోని అన్ని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తూ ఉంటుంది.అందుకు సంబంధించి టూర్ ప్యాకేజీలలో ఇది ఒకటి.

ఇండియన్ రైల్వే అండ్ టూరిజం కార్పొరేషన్-ఐఆర్‌‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఈ ప్యాకేజీకి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి.ఈ ఏడు జ్యోతిర్లింగాల యాత్ర టికెట్లను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.లేదంటే ఐఆర్‌సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ కేంద్రాల్లో, స్థానిక కార్యాలయాల్లోనూ టికెట్స్ బుక్‌ చేసుకోవచ్చు.

7 జ్యోతిర్లింగాలతో పాటు సమతా మూర్తి-స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రయాణానికి సంబంధించిన జర్నీ 2022 జనవరి 4న ప్రారంభం అవుతుంది.ఈ పూర్తి యాత్ర 12 రోజుల పాటు ఉంటుంది.

భారత్ దర్శన్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్.జనవరి 04, 2022న గోరఖ్‌పూర్ నుంచి మొదలవుతుంది.ప్రయాణికులు గోరఖ్‌పూర్ లేదంటే డియోరియా సదర్.

బెల్తరా రోడ్, వారణాసి, భదోహి అలాగే ఝంఘై, ప్రయాగ్‌రాజ్ సంగం, ప్రతాప్ గడ్, గౌరీగంజ్, రాయ్ బరేలీ, లక్నో, కాన్పూర్, ఝాన్సీ స్టేషన్‌లలో ఎక్కడైనా ఎక్కొచ్చు.

ఈ యాత్రలో ఉజ్జయిని, సోమనాథ్, వడోదర, ద్వారక, పర్లి వైజనాథ్, పూణే, ఔరంగాబాద్, నాసిక్ రోడ్ తదితర ప్రాంతాలకు తీసుకువెళ్తారు.

ఈ యాత్ర ప్యాకేజీ టికెట్ ధర 12,285 రూపాయలు.అయితే ఈ యాత్రకు వెళ్లానుకునే వారు రెండు డోసు టీకా తప్పనిసరిగా తీసుకుని ఉండాలని నిబంధన విధించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube