మన పురాణ ఇతిహాసాల ప్రకారం హరి, హర తత్త్యాత్మకం.శ్రీరాముడు విష్ణు అంశంగా అవతారమెత్తిన సంగతి మనకు తెలిసినదే.అదేవిధంగా హనుమంతుడు శివాంశసంభూతుడు.దీనికి సంబంధించిన కథ మనకు రామాయణంలో తెలుస్తుంది.పురాణాల ప్రకారం శివపార్వతులకు జన్మించిన పుత్రుని వల్ల తారక సంహారం జరుగుతుందని భావించిన దేవతలు ఆ శివపార్వతులకు కళ్యాణం జరిపించి, వారికి శయ్యమందిరం ఏర్పాటు చేశారు.ఆ విధంగా శివ పార్వతి ఇద్దరు ఏకాంతంగా శయ్యమందిరం పై చేరారు.
వీరి సంతానం వల్ల తారక సంహరణ జరుగుతుందని భావించిన దేవతలు వారికి పుట్టబోయే సంతానం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూశారు.

అయితే శోభనం గదిలోకి వెళ్ళిన శివపార్వతులు రోజులు గడిచాయి, నెలలు గడిచినా బయటికి రాకపోవడంతో లోపల ఏం జరుగుతుందో తెలియక దేవతలు సందిగ్దంలో పడ్డారు.అయితే లోపల గదిలో ఏమి జరుగుతుందో తెలుసుకుని రావాలని దేవతలందరూ కలిసి అగ్నిదేవుడిని, వాయుదేవుని లోపలికి పంపారు.అదే సమయంలో శివ తేజస్సు బహిర్గతమవుతున్న సమయంలో లోపలికి ఎవరో వచ్చారు అన్న సందేహం కలిగిన పార్వతి దేవి శివుడు నుంచి దూరంగా జరుగుతుంది.

శివుని తేజస్సు భూ పతనం కానివ్వకుండా బంధించి ఆ తేజస్సును అగ్ని, వాయు దేవతలకు చెరిసగం పంచి పంపాడు.తనకు దక్కాల్సిన శివ తేజస్సు ఈ విధంగా దేవతలు తీసుకువెళ్లడంతో ఎంతో బాధపడిన పార్వతి దేవి ఆ దేవతల వల్ల కార్య భంగం కలిగిందనే కోపంతో‘దేవతలకు స్వభార్యల వలన సంతానం పుట్టకుండుగాక’ అని శపించింది.ఈ విధంగా శివ తేజస్సును పంచుకున్న దేవతలు శివ తేజస్సుని భరించలేక అగ్నిదేవుడు గంగానదిలో కలిపాడు.గంగాదేవి కూడా శివ తేజస్సుని భరించలేక శివ తేజస్సును ఒడ్డుకు నెట్టింది.

ఆ శివ తేజస్సు రెల్లు పొదలలో పడి ఆరు ముఖాలు కలిగిన షణ్ముఖుడు జన్మించాడు.ఇక వాయుదేవుడుకు పంచిన శివ తేజస్సు వల్ల సంతానం కోసం తపస్సు చేస్తున్న అంజనా దేవి గర్భంలోకి శివ తేజస్సును వేయటం వల్ల అంజనాదేవి ఆంజనేయుడుకి జన్మనిచ్చింది.