ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలోని తిరుమల దేవ స్థానాన్ని దర్శించుకోవడానికి చాలా మంది ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు.ఎందుకంటే ఈ పుణ్య క్షేత్రం అంతా విశిష్టమైనది.
అంతే కాకుండా ఈ సంవత్సరంలో చివరి నెల డిసెంబర్ కావడంతో, ప్రతి సంవత్సరం డిసెంబర్ లో తిరుమల శ్రీవారిని మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు తరలి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు.నిత్యం గోవింద నామాస్మరణలతో తిరుమల కొండలు మార్మోగుతూ ఉంటాయి.
ఈ నేపథ్యంలో డిసెంబర్ నెల లో తిరుమలలో జరిగే విశేషాలు, ఉత్సవాల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే డిసెంబర్ 3వ తేదీన పార్వేట మండపంలో కార్తీక వనభోజనా ఉత్సవం జరుగుతుంది.అలాగే డిసెంబర్ 8వ తేదీన సర్వ ఏకాదశి( sarva Ekadashi ) నిర్వహిస్తారు.ఇంకా చెప్పాలంటే డిసెంబర్ 12వ తేదీన అధ్యయనోత్సవాలు మొదలవుతాయి.
అలాగే డిసెంబర్ 17వ తేదీన ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి.ఇంకా చెప్పాలంటే డిసెంబర్ 22వ తేదీన తిరుమల శ్రీవారి సన్నిధిలో చిన్న ఉత్సవాలు ఉంటాయి.
అలాగే డిసెంబర్ 23వ తేదీన వైకుంఠ ఏకాదశి( Vaikuntha Ekadashi ) మొదలవుతుంది.ఆ తర్వాత శ్రీవారి దేవాలయంలో వైకుంఠ ద్వార దర్శనం మొదలవుతుంది.
ఇంకా చెప్పాలంటే ఆ రోజున ఆ ఏడు కొండలవాడిని తనివితీరా దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు.అలాగే సర్వ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్ సేవా దర్శనం, అర్జిత సేవా దర్శనం, విఐపి బ్రేక్ దర్శనం వంటి మార్గాల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చని ఆలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.అలాగే ఈ ప్రత్యేక రోజులలో భక్తుల రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.