ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది.18 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి వేచి ఉన్నారు.సర్వదర్శనానికి సాధారణంగా 12 గంటల సమయం పడుతుంది.శనివారం రోజు స్వామివారిని దాదాపు 67,000 మంది భక్తులు దర్శించుకున్నారు.అంతేకాకుండా 29,270 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించారు.తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా దాదాపు మూడున్నర కోట్ల ఆదాయం వచ్చింది.
ఇంకా చెప్పాలంటే దేశంలో నుంచి స్వామి వారిని దర్శించుకోవడానికి తిరుమల కు వచ్చే భక్తులకు అవసరమైన వసతి గదుల కోటను ఎప్పుడు విడుదల చేస్తారనేది తిరుమల దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమలలో వసతి గదులకోట బుకింగ్ మొదలుపెట్టనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే వసతి గృహాలను బుక్ చేసుకోవాలని తిరుమల దేవస్థానం అధికారులు వెల్లడించారు.తిరుమలలో వేరువేరుగా అనేక రకాల వసూతి గదులు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.
శ్రీ పద్మావతి అతిధి గృహం, శ్రీ వెంకటేశ్వర అతిధి గృహం, రామ్ భగీచా వరాహ స్వామి విశ్రాంతి భవనం, ట్రావెల్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి.వాటిలో ఆన్ లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది.

అంతేకాకుండా ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం,సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన ఇతర అర్జిత సేవా టికెట్లను కూడా విడుదల చేశారు.ఆన్ లైన్ లక్కీ డిప్ నమోదు ప్రక్రియను ఈ నెల 22వ తేదీ నుంచి మొదలుపెట్టారు.లక్కీడిప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు డబ్బులు చెల్లించి తేదీలను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక తాజాగా వసతి గదులకు సంబంధించిన మార్చి నెల కోటను ఈ నెల 27వ తేదీన విడుదల చేయబోతున్నారు.