ముఖ్యంగా చెప్పాలంటే మన శరీర ఆరోగ్యానికి రక్తప్రసరణ( Blood circulation ) ఎంతో అవసరం.రక్తప్రసరణకు ఏ అడ్డంకి లేకుండా చూసుకుంటూ ఉండాలి.
కొన్ని రకాల పండ్లు తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుందనీ వైద్య నిపుణులు చెబుతున్నారు.మరి ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్య నిపుణుల ప్రకారం కొన్ని రకాల పండ్లలో రక్తప్రసరణను మెరుగుపరిచే గుణం ఉంటుంది.ఇవి రక్తనాళాలను రిలాక్స్ చేసి సాగిలా చేస్తుంది.
ఇంకా ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిపోతుంది.ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కార్డియోవాస్క్య్యూలర్ సిస్టం లో కొలెస్ట్రాల్ స్థాయిలోను తగ్గిస్తుంది.

దీంతో బ్లడ్ ప్రెషర్ కూడా సాధారణంగా ఉంటుంది.బ్లూ బెర్రీలలో ( blue berries )యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.ఇందులో ఆంథోసియానైన్స్ ( Anthocyanins )అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.ఇవి రక్తనాళాల పని తీరును మెరుగుపరుస్తాయి.అంతే కాకుండా గుండె సంబంధిత సమస్యలను రాకుండా చేస్తాయి.బ్లూబెర్రీలో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటుంది.
ఈ రెండు కూడా బ్లడ్ సర్క్యూలేషన్‌కు ఎంతో ముఖ్యం.అలాగే విటమిన్ సి( Vitamin C ) ఉండే పండ్లు కూడా రక్తనాళాలను బలపరిచేలా సాయం చేస్తాయి.

అంతే కాకుండా కొల్లాజెన్ ( Collagen )ఉత్పత్తికి కూడా ప్రేరేపిస్తాయి.ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి.అలాగే పుచ్చకాయలో( watermelon ) అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.దీన్ని సిట్రల్లైన్ అని అంటారు.ఇది శరీరంలో ఆర్జినైన్ మారుతుంది.ఆర్జినైన్ మన శరీరంలో నైట్రిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇది రక్త సరఫరా మార్గాన్ని విస్తరింపజేసి రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది.దీంతో రక్తప్రసరణ మెరుగుతుంది.
పుచ్చకాయలో ఉండే లైకోపీన్ లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఆక్సిడెంట్ ఉంటుంది.ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది.
కివి పండ్లలో( kiwi fruit ) కూడా విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.ఇవి రక్తనాళాలను డ్యామేజ్ కాకుండా రక్షిస్తాయి.