కేరళలో నిఫా వైరస్.. రంగంలోకి కేంద్ర బృందం

కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టించింది.ఈ వైరస్ బారిన పడి 12 ఏళ్ల బాలుడు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ ప్రకటించారు.

 Nifaa Virus Enters Kerala State Central Government In Action, Nifaa Virus ,keral-TeluguStop.com

శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.బాలుడి నమూనాలను పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కి పంపారు.

వాటిని విశ్లేషించిన నిపుణులు నిఫా వైరస్ సోకినట్లు నిర్ధారించారు.దీంతో బాలుడు తో కాంటాక్ట్ లో ఉన్న వారందరినీ గుర్తించే ప్రక్రియ చేపట్టామని ఆరోగ్య మంత్రి తెలిపారు.

ఇప్పటి వరకూ 188 ప్రైమరీ కాంటాక్ట్ ను గుర్తించడం జరిగిందన్నారు.వారిలో 20 మంది పరిస్థితి హైరిస్క్ కేటగిరీలో ఉన్నదని, అందుకే వారిని కోజికోడ్ లోని ఎంసీహెచ్ కు తరలించి వైద్యం అందిస్తున్నామని తెలిపారు.

ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని వైరస్ మరింత విస్తరించకుండా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించామని వీణాజార్జి చెప్పారు.మరణించిన బాలుడు ఇంటి చుట్టూ మూడు కిలోమీటర్ల మేర లాక్ డౌన్ విధించినట్లు ఆమె తెలిపారు.

బాలుడు కుటుంబంలో ప్రస్తుతం ఎవరికీ వైరస్ కు సంబంధించిన లక్షణాలు లేవని తెలిపారు.కోజికోడ్ లో పరిస్థితిని సమీక్షించడానికి ఇప్పటికే అధికారులు బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలను నిఫా వైరస్ లక్షణాలు గుర్తించామన్నారు.

Telugu Boy, Central, Veena George, Kerala, Nifaa-Latest News - Telugu

వారిలో ఒకరు ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు.మరోకరు కోజికోడ్ మెడికల్ కాలేజీ స్టాఫ్ మెంబర్స్ గా ఉన్నారు.మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో పై వార్డు పూర్తిగా నిఫా వార్డు గా మార్చినట్లు పేర్కొన్నారు.మరోవైపు నిఫా వైరస్ కలంతో కేంద్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది.

కేరళ ఆరోగ్యశాఖకు సహకారంగా కేంద్రం తరపున ప్రత్యేక బృందం రాష్ట్రానికి చేరుకుంది.కేరళలో 2018 లో తొలిసారిగా వెలుగులోకి వచ్చింది మొత్తం 23  కేసులను నిర్ధారించారు.

వీరిలో కేవలం ఇద్దరు మాత్రమే కోలుకోవడం కావడం గమనార్హం.  2019లో మరోసారి ఒకరిలో వైరస్ నిర్ధారణ అయింది.

పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఒక్క కేసుతోనే వ్యాప్తికి అడ్డుకట్ట పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube