తిరునాళ్లు, జాతరలు ఎందుకు జరుపుతుంటారో తెలుసా?

మనం చిన్నప్పటి నుంచి తిరునాళ్లు, జాతరలు చాలానే చూసి ఉంటాం.ఏదో ఒక పండుగ లేదా బ్రహ్మోత్సవాలు వంటి కార్యక్రమాల్లో తిరునాళ్లు, జాతరలు జరుపుతుంటారు.

  what Is The Reason Behind We Are Celebrated Thirunallu And Jatharas , Devotion-TeluguStop.com

అయితే ఎంతో మందికి ఇష్టమైన ఈ తిరునాళ్లు, జాతరల ఎన్నెన్నో వస్తువులు అమ్ముతుంటారు.అయితే అసలు ఇవెలా వచ్చాయి, వీటిని ఎందుకు జరుపుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తిరునాళ్లు అంటే ఊరి పండుగ.జన సాంస్కృతిక ఉత్సవాలనే తిరునాళ్లు, జాతరలు అంటారు.తిరు అంటే మంగళ కరం అని అర్థం.తిరునాళ్లు అంటే శుభకరమైన దినాలు అని అర్థం.

తిరునాళ్ అనే పదం తమిళ భాష నుండి తెలుగుకు సంక్రమించింది.జాతర అనేది తెలుగు పదం.సమస్త ప్రాణుల్లాగే మనుషులు కూడా ప్రాణులే అయినా సృష్టిలో ఏ ప్రాణికి లేని మేధా శక్తి మనిషికి మాత్రమే ఉంది.అందుకే ప్రాణులన్నిటిలోకి మనిషే గొప్ప వాడయ్యాడు.

తనకన్నా ఎన్నో రెట్లు బలమైన ప్రాణుల్ని కూడా లొంగదీసుకొని సేవ చేయించుకుంటున్నాడు.మనిషి వివేకం తెచ్చుకొని, భాష నేర్చుకొని, సుఖాలు తెల్సుకున్న తర్వాత వినోద విజ్ఞానాల వైపుకి దృష్టి సారించాడు.

సాంఘిక కట్టుబాట్లను ఏర్పరుచుకున్నాడు.సాంఘిక ఆచారాలు నియమాలు సజావుగా సాగాలంటే మనుషులకు భయం ఉండాలి కాబట్టి దేవుడు, దేవాలయాలను సృష్టించారు.

అయితే పున్నమి దినాల్లో మాత్రమే జరిగే తిరునాళ్లకు దూర దూరాల నుంచి రక రకాల విజ్ఞాన దాయకమైన హస్తకళా వస్తువులు, గృహోపకరణాలు, దుస్తులు అమ్మకానికి వచ్చేవి.అక్కడ శ్రీమంతుడు, పేదవాడు అనే తేడా ఉండకూడదు కాబట్టి అందరూ కలిసిపోయేవారు.

ఈసమయంలోనే వివాహాలు నిశ్చయం అయ్యేవి.పాత తగాదాలు కూడా పరిహారం అయ్యేవి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube