అయోధ్య సీతమ్మ కోసం అనంతపురం చీర.. ఈ చీర ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?

అయోధ్య రామ మందిరం( Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవానికి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది.రామ మందిర ప్రారంభానికి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, ఇతర సినీ ఇండస్ట్రీల ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి.

అయోధ్య నుంచి పిలుపు రావడంతో సతీసమేతంగా వెళ్తానని చిరంజీవి ప్రకటించగా, చరణ్ దంపతులకు, పవన్ కు కూడా రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది.

 Special Dharmavarm Saree For Ayodhya Details Here Goes Viral In Social Media -�-TeluguStop.com

ఈ ఆహ్వానం అందిన వారిలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas )సైతం ఉన్నారు.

సీతమ్మ జన్మస్థలమైన నేపాల్ లోని జనక్ పూర్( Janakpur ) నుంచి అయోధ్యకు 3,000కు పైగా కానుకలు వచ్చాయని తెలుస్తోంది.ఈ కానుకలలో దుస్తులు, ఆభరణాలతో పాటు వెండి పాదుకలు సైతం ఉన్నాయని సమాచారం అందుతోంది.

ఈ ఆలయం కోసం తయారు చేసిన గంట బరువు 2100 కిలోలు అని తెలుస్తోంది.రాముడి ప్రాణప్రతిష్టకు హాజరయ్యే భక్తుల కొరకు 7000 కేజీల రామ్ హల్వాతో పాటు 200 కేజీల లడ్డూలను తయారు చేయిస్తున్నట్టు భోగట్టా.

Telugu Ayodhya, Janakpur, Nepal, Prabhas, Rama Mandir-General-Telugu

అయితే అయోధ్య రాముని భక్తుడైన అనంతపురానికి చెందిన ఒక చేనేత కార్మికుడు తన భక్తిని మరో విధంగా చాటుకున్నాడు.120 రోజుల పాటు కష్టపడి అయోధ్య సీతమ్మ కోసం ధర్మవరానికి చెందిన ఈ భక్తుడు ఏకంగా లక్షా 50 వేల రూపాయలు ఖర్చు చేసి చీరను తయారు చేశాడు.ఎన్నో ప్రత్యేకతలతో ఉన్న ఈ చీరకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

Telugu Ayodhya, Janakpur, Nepal, Prabhas, Rama Mandir-General-Telugu

అయోధ్యలోని ట్రస్ట్ కు ఈ చీరను అందిస్తానని ఆ చేనేత కార్మికుడు చెబుతున్నాడు.ఈ చీరపై 322 సార్లు జై శ్రీరామ్ అనే నామాన్ని 13 భాషల్లో పొందుపరిచారు.రామాయణానికి సంబంధించిన ఎన్నో దృశ్యాలను ఈ చీరపై చూడొచ్చు.

ఈ చీర అంచుపై పుత్రకామేష్టియాగం నుంచి శ్రీరామ పట్టాభిషేకం వరకు చాలా ఘట్టాలు పొందుపరిచి ఉన్నాయి.ఈరోజు నుంచి రామ మందిరంలో ప్రత్యేక పూజలు జరగనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube