ముఖ్యంగా చెప్పాలంటే మనలో చాలా మంది ప్రజలు రుద్రాక్ష ( Rudraksha ) ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు.రుద్రాక్ష ధరించడం వల్ల మానసికంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పెద్దవారు చెబుతారు.
రుద్రుడి నుంచి రాలిన కన్నీటి చుక్కలు రుద్రాక్షలుగ మారాయని ప్రజలు నమ్ముతున్నారు.శివుని ప్రతిరూపాలుగా చాలా మంది ప్రజలు రుద్రాక్షలను కొలుస్తారు.
నిత్యజీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే అలాంటి వారు రుద్రాక్షలను ధరించడం ఎంతో మంచిది.

రుద్రాక్షను ధరించడమే కాకుండా రుద్రాక్షను ధరించినప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి.ఆ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.రుద్రాక్షను ధరించడం వల్ల కష్టాలు, నష్టాలు సైతం దూరమైపోతాయి.
రుద్రాక్ష వృక్షాలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండడంతో పాటు ఈ వృక్షాలు చాలా ఖరీదైనవి.ఇంకా చెప్పాలంటే ఎవరైతే రుద్రాక్ష మాలను ధరిస్తారో అలాంటి వారు మైల పడిన వాళ్లను తాకకూడదు.
అలాగే రుతుక్రమంలో స్త్రీలు రుద్రాక్ష కు దూరంగా ఉండటమే మంచిది.

ముఖ్యంగా చెప్పాలంటే ఒకరు వాడిన రుద్రాక్ష ను మరొకరు ఉపయోగించకూడదు.ఎవరైతే రుద్రాక్ష మాలను( Rudraksha Mala ) ధరిస్తారో అలాంటి వారు శ్మశానానికి వెళ్ళకూడదు.ఎవరైతే ఏకముఖి రుద్రాక్షను( Ekamukhi Rudraksha ) ధరిస్తారో అలాంటి వాళ్ల పై దుష్టశక్తుల ప్రభావం ఉండదు.
అంతే కాకుండా ఈ రుద్రాక్షల ధరిస్తే ఆర్థిక స్థిరత్వం పొందే అవకాశం కూడా ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే మానసిక వ్యాధులను, దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో రుద్రాక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని వేద పండితులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే రుద్రాక్షలను ధరించడం వీలు కానీ పక్షంలో పూజ గదిలో ఉంచి రుద్రాక్షను పూజించడం ద్వారా కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.కాబట్టి రుద్రాక్షను ధరించిన వారు కచ్చితంగా ఈ నియమాలను పాటించాలి.