ఈ బాత్ పౌడర్ తో రోజు స్నానం చేస్తే చర్మం యవ్వనంగా మెరిసిపోవడం ఖాయం!

ప్రస్తుతం మార్కెట్లో మనకు ఎన్నో రకాల సోప్స్ అందుబాటులో ఉన్నాయి.వాటిలో ఏది నచ్చితే దాన్ని కొనుగోలు చేసి వాడుతుంటారు.

 Bathing With This Bath Powder Will Make Your Skin Glow! Bath Powder, Home Made B-TeluguStop.com

అయితే ఎంత ఖరీదైన సోప్ ను వాడినా సరే అందులో ఉండే కెమికల్స్‌ చర్మానికి ఎంతో కొంత హాని చేకూరుస్తూ ఉంటాయి.కానీ సోప్ కు బదులుగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ బాత్ పౌడర్ తో రోజు స్నానం చేస్తే చర్మ ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు.

పైగా చర్మం యవ్వనంగా మరియు కాంతివంతంగా మెరిసిపోవడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ బాత్ పౌడ‌ర్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి, మూడు టేబుల్ స్పూన్లు పెసర పిండి వేసుకుని కలుపుకోవాలి.ఆ తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు రోజ్ పెటల్స్ పౌడర్ మరియు వన్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్ వేసి అన్ని కలిసేంత వరకు స్పూన్ సహాయంతో మిక్స్ చేసుకోవాలి.

త‌ద్వారా మన బాత్‌ పౌడర్ సిద్ధం అవుతుంది.ఒక డబ్బాలో నింపుకుంటే ఈ బాత్ పౌడ‌ర్‌ మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది.సోప్ కు బదులుగా ఈ బాత్‌ పౌడర్ లో వాటర్ మిక్స్ చేసి రోజు వాడితే చర్మం పై పేరుకు పోయిన మురుకి, మలినాలు తొలిగిపోతాయి.చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

త్వరగా ముడతల‌ సమస్య రాకుండా ఉంటుంది.చర్మం అందంగా మరియు కాంతివంతంగా మెరుస్తుంది.

ఈ బాత్‌ పౌడర్ ను వాడటం వల్ల స్కిన్ టోన్‌ సైతం మెరుగుపడుతుంది.కాబట్టి చర్మాన్ని ఆరోగ్యంగా మరియు అందంగా మెరిపించుకోవాలని భావించేవారు తప్పకుండా ఈ హోమ్ మేడ్ బాత్ పౌడర్ ను వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube