బ్రేక్ ఫాస్ట్ హెవీగా తిన్నా కూడా కొందరికి కాసేపటికే నీరసం వచ్చేస్తుంటుంది.దాంతో మనసు మళ్ళీ ఆహారం వైపు లాగుతుంది.
ఇలా పదేపదే తినడం వల్ల బాడీ వెయిట్( Body weight ) అనేది అదుపు తప్పుతుంది.అందువల్ల బ్రేక్ ఫాస్ట్ లో తీసుకునే ఫుడ్ అనేది రుచికరంగానే కాదు కడుపుకు ఫిల్లింగ్ గా ఉండాలి.
ఎక్కువ సమయం పాటు మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ చాలా బాగా సహాయపడుతుంది.

బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోస, వడ, చపాతీ వంటి టిఫిన్స్ కు బదులుగా ఈ స్మూతీని తీసుకుంటే నీరసం అన్న మాటే అనరు.అందుకోసం ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్( Rolled oats ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ వేయించిన అవిసె గింజలు( Flax seeds ), వన్ టీ స్పూన్ చియా సీడ్స్( Chia seeds ), రెండు టేబుల్ స్పూన్లు వేయించి పొట్టు తొలగించిన వేరుశనగలు( Peanuts ), నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు( Dates ), పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, సన్నగా తరిగిన హాఫ్ యాపిల్ ముక్కలు మరియు ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకుంటే హై ప్రోటీన్ ఓట్స్ స్మూతీ అనేది రెడీ అవుతుంది.

బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్ గా ఉండడానికి అవసరమయ్యే శక్తి శరీరానికి అందుతుంది.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.కడుపు ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంటుంది.
ఆకలి అదుపులో ఉంటుంది.అలాగే ఈ స్మూతీ కండరాల మరమ్మత్తు మరియు పెరుగుదలకు అవసరమైన అమైనో ఆమ్లాలను అందిస్తుంది.
ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది.అంతేకాకుండా ఈ ఓట్స్ స్మూతీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణ నష్టాన్ని నిరోధిస్తాయి.
కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల సంభవ రేటును కూడా తగ్గిస్తాయి.