ముఖంపై మొటిమలు( Pimples ) వచ్చాయంటే చాలు తెగ హైరానా పడిపోతుంటారు.వాటిని ఎలా పోగొట్టుకోవాలి అని మధన పడుతూ ఉంటారు.
మొటిమలు అందాన్నే కాదు ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాయి.అందుకే ప్రతి ఒక్కరూ వాటికి దూరంగా ఉండాలని అనుకుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీ అందుకు ఉత్తమంగా సహాయపడుతుంది.మొటిమలు మరియు వాటి తాలూకు మచ్చలను మాయం చేసి ముఖాన్ని అందంగా మెరిపించడానికి ఈ రెమెడీని ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఇంకెందుకు లేటు రెమెడీ గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్ ను వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ నీమ్ పౌడర్( Neem Powder ), వన్ టేబుల్ స్పూన్ తేనె, పావు టేబుల్ స్పూన్ పసుపు మరియు సరిపడా పాలు( Milk ) వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు మెడకు కూడా అప్లై చేసుకుని పదిహేను నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.
ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని.మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.వేప పొడి, పసుపు, తేనె.ఇవి మొటిమలకు వ్యతిరేకంగా పోరాడతాయి.
వేగంగా మొటిమలు తగ్గిస్తాయి.వాటి తాలూకు మచ్చలను సైతం క్రమంగా మాయం చేస్తాయి.
అలాగే బీట్ రూట్ పౌడర్ చర్మ సౌందర్యాన్ని పెంచడానికి గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.స్కిన్ టోన్ ను ఇంప్రూవ్ చేస్తుంది.
అందంగా మెరిపిస్తుంది.
ఇక పాలల్లో ఉండే పోషకాలు స్కిన్ డ్రై( Dry Skin ) అవ్వకుండా రక్తిస్థాయి.చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా మృదువుగా ఉంచుతాయి.కాంతివంతంగా మెరిపిస్తాయి.
కాబట్టి మొటిమలు మచ్చలు లేని మెరిసే అందమైన చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఈ సింపుల్ హోమ్ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.