కండలు పెంచాలంటే ఈ ఆహారాలు తినాల్సిందే  

superfoods useful for muscle building -

కండలు పెంచాలంటే కేవలం జిమ్ లో కష్టపడితే సరిపోదు కదా … కండలు రావాలంటే మాంసం పెంచే ఆహారం కూడా కావాలి.ప్రోటీన్లు కావాలి, అప్పుడే మాంసం పొందుతారు, జిమ్ కి వెళ్లి కొవ్వు కరిగించి కండలు పెంచాలి.

TeluguStop.com - Superfoods Useful For Muscle Building

మరి కండలు పెంచాలంటే మన శరీరానికి అవసరమైన బేసిక్ ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం

* చికెన్ లో దాదాపుగా అన్నిరకాల ప్రోటీన్లు ఉంటాయి.కండబలం కోసం అత్యవసర ఆహారంగా చికెన్ ని చెప్పుకోవచ్చు.

TeluguStop.com - కండలు పెంచాలంటే ఈ ఆహారాలు తినాల్సిందే-Telugu Health-Telugu Tollywood Photo Image

ఇది ఎముకలని బలపరుస్తుంది, కండలకి కావాల్సిన బలాన్ని అందిస్తుంది.కాబట్టి జిమ్ కి వెళ్ళాలంటే చికెన్ అలవాటు చేసుకోవాల్సిందే.

అయితే ఒక కండిషన్, స్కిన్ లెస్ చికెన్ మాత్రమే తినాలి

* పాలకూరలో ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, జింక్, నియాసిన్, ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కె, ఉంటాయి.ఇది ఎముకలతో పాటు మీ కండలకి కూడా బలాన్ని ఇస్తుంది.

దీనిలో గ్లుటామిన్, ఎమినో ఆసిడ్స్ బాగా ఉండటం వలన ఇది మజిల్ గ్రోత్ కి బాగా సహాయపడుతుంది

* ఓట్ మీల్ లో మీకు అవసరమైన యాంటిఆక్సిడెంట్స్, ఫైబర్, కాల్షియం, పొటాషియం ఉంటాయి.దీనితో మీకు వచ్చే లాభం ఏమిటంటే, ఇది కేవలం మీకు కండలు పెరగడానికి సహాయపడటమే కాదు, బ్యాడ్ కొలెస్టిరాల్, బ్లడ్ ప్రెషర్ ని కూడా అదుపులో ఉంచుతుంది.కార్బోహైడ్రేట్లు కూడా అవసరమైనంత దొరుకుతాయి

* జిమ్ కి వెళ్లి కండలు పెంచాలనుకునే వారు వైట్ రైస్ కి బదులు, బ్రౌన్ రైస్ తినడం మేలు.వర్కవుట్ కి కొన్ని గంటల ముందు తీసుకోని,జిమ్ కి వెళితే మంచి ఎనర్జీతో వర్కవుట్ చేస్తారు.ఇది శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తుంది, అలాగే కండలు పెరిగేందుకు సహాయపడుతుంది

* ప్రోటీన్ల గురించి మాట్లాడుకున్నప్పుడు గుడ్ల గురించి కూడా మాట్లాడుకోవాలి.చాలా రిచ్ ప్రోటీన్లు కలిగిన గుడ్లలో విటమిన్ డి, అమినో ఆసిడ్స్, మంచి కొవ్వు బాగా లభిస్తుంది.

అందుకే ఇది కండలు పెరిగేందుకు దోహదపడుతుంది

* రెడ్ మీట్ కూడా మజిల్ బిల్డింగ్ కి ఉపయోగపడే ఆహారమే అయినా, దీన్ని మితంగా తీసుకోవాలని పరిశోధనలు చెబుతున్నాయి

* బీట్ రూట్స్ బ్లడ్ సర్కిలేషణ్ ని మరుగుపరిచే ఆహారం.కాబట్టి జిమ్ లో ఎక్కువసేపు గడపడానికి ఇది తప్పనిసరి.

దీనితో పాటు వె ప్రోటీన్, కినొవా, కాట్టేజ్ చీజ్ కూడా కండల దేహం కోసం పనికొచ్చే ఆహారాలే.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు