ఆడ, మగ అనే తేడా లేకుండా అందరినీ కామన్‌గా వేధించే సమస్య హెయిర్ ఫాల్.ఎంత కేర్ తీసుకున్నా.ఎన్ని ష్యాంపూలు, హెయిర్ ఆయిల్స్ మార్చినా.కొందరిలో జుట్టు ఊడిపోతూనే ఉంటుంది.ఈ విధంగా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన, ఆనవసర విషయాలను ఆలోచించడం, పోషకాల లోపం, తల స్నానం చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు చేయడం ఇలా రకరకాల కారణాల వల్ల హెయిర్ ఫాల్ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
అయితే కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తే.సులభంగా హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టవచ్చు.ముఖ్యంగా జుట్టు రాలడాన్ని తగ్గించడంలో క్యారెట్ అద్భుతంగా సహాయపడుతుంది.మరి క్యారెట్‌ను ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా క్యారెట్ తీసుకుని ఉడకబెట్టి పెస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో కొద్దిగా కొబ్బరి నూనె వేసి.తలకు, కేశాలకు బాగా పట్టించాలి.అర గంట పాటు వదిలేయాలి.ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేసేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.
జుట్టు రాలడం తగ్గుతుంది.
అలాగే క్యారెట్‌ను మెత్తగా పేస్ట్ చేసి రసం తీసుకోవాలి.ఆ రసంలో కొద్దిగా నిమ్మరసం మరియు పెరుగు వేసి బాగా కలిపి తలకు పట్టించాలి.గంట పాటు ఆరనిచ్చి.
అనంతరం తల స్నానం చేయాలి.ఇలా వారంలో ఒకటి లేదా రెండు సార్లు చేస్తే.
హెయిర్ ఫాల్ తగ్గడంతో పాటు చుండ్రు సమస్య కూడా పోతుంది.
ఇక క్యారెట్‌ను మెత్తగా పేస్ట్ చేసి అందులో అవోకాడో పేస్ట్, బాదం ఆయిల్ వేసి కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.అర గంట లేదా గంటు పాటు వదిలేపి.
ఆ తర్వాత హెడ్ బాత్ చేసేయాలి.ఇలా చేసినా.
హెయిల్ ఫాల్ సమస్య తగ్గుముఖం పడుతుంది.