నుదురు న‌ల్ల‌గా మారుతోంది? అయితే టెన్ష‌న్ వ‌ద్దు.. ఇలా చేయండి!

సాధార‌ణంగా కొంద‌రికి ముఖం ఎంతో తెల్ల‌గా ఉంటుంది.కానీ, నుదురు మాత్రం న‌ల్ల‌గా మారుతుంటుంది.

 How To Get Rid Of Forehead Darkness At Home! Forehead Darkness, Forehead, Darkne-TeluguStop.com

హార్మోన్ ఛేంజ‌స్‌, ఎండ‌ల ప్ర‌భావం, హైపర్ పిగ్మెంటేషన్, డీహైడ్రేష‌న్‌, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల నుదురు న‌ల్ల‌గా మారుతుంటుంది.అలాగే త‌ర‌చూ చెమట తుడుచుకోవడం వల్ల నిరంతరం రాపిడి ఏర్ప‌డుతుంది.

అందువ‌ల్ల కూడా నుదురు డార్క్‌గా త‌యార‌వుతుంది.దాంతో ఆ న‌లుపును ఎలా వ‌దిలించుకోవాలో అర్థంగాక తెగ స‌త‌మ‌తం అయిపోతుంటారు.

అయితే టెన్ష‌న్ వ‌ద్దు.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని ట్రై చేస్తే న‌ల్ల‌గా మారిన నుదురును తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు.

మ‌రి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అంద‌లో వ‌న్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడ‌ర్‌, అర క‌ప్పు గోరు వెచ్చ‌ని నీరు పోసి బాగా క‌లిపి ఐదు నిమిషాల పాటు వ‌దిలేయాలి.

ఈలోపు ఒక చిన్న అర‌టి పండును తీసుకుని తొక్క తొల‌గించి.స‌న్న‌గా స్లైసెస్‌గా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు కాఫీ పౌడ‌ర్ క‌లిపిన‌ వాట‌ర్ లో అర‌టి పండు ముక్క‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ కొబ్బ‌రి నూనె, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాట‌ర్ వేసుకుని స్పూన్‌తో క‌లిపి రెండు గంట‌ల పాటు వ‌దిలేయాలి.

Telugu Tips, Forehead, Latest, Skin Care, Skin Care Tips-Telugu Health Tips

ఆపై వాట‌న్నిటినీ మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఏదైనా బ్ర‌ష్ సాయంతో నుదురుపై అప్లై చేసుకుని.ఆర‌బెట్టుకోవాలి.

కంప్లీట్‌గా కూల్ అయిన వెంట‌నే గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా చ‌ర్మాన్ని క్లీన్ చేసుకుని ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్ లేదా సీర‌మ్‌ను రాసుకోవాలి.ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీని ప్ర‌తి రోజు పాటిస్తే గ‌నుక న‌ల్ల‌గా మారిన నుదురు కేవ‌లం కొద్ది రోజుల్లోనే తెల్ల‌గా మ‌రియు మృదువుగా మారుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube