బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో అపురూపమైన తీపి జ్ఞాపకం.ఎటువంటి కల్మషం లేకుండా, స్వేచ్ఛగా, హాయిగా ఉండే జీవితం బాల్య జీవితం.
చిన్నప్పుడు ఆడే ఆటలు, అల్లరి, ఇలా ఎంతో మధురమైన జ్ఞాపకంగా బాల్యం ఉండాలి.అలా ఉన్న వారు జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా, జీవితాంతం సుఖంగా గడుపుతారు.
బాల్యంలో అధిక ఒత్తిడికి గురయ్యేవారిలో వారు పెరిగే కొద్ది వారితో పాటు అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయని పరిశోధనల్లో తేలింది.
పిల్లలు అధిక ఒత్తిడికి గురికాకుండా వారిని ఆనందంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రి మీద ఉంటుంది.
సాధారణంగా నొప్పి, గాయం, అనారోగ్య సమస్యలు వంటివి పిల్లలు అధిక ఒత్తిడిని కలుగజేస్తాయి.అంతేకాకుండా పాఠశాలలో అధిక ఒత్తిడిని ఎదుర్కోవడం.స్నేహితులతో సమస్యలు లేదా బెదిరింపుల వల్ల పిల్లలు అధిక ఒత్తిడికి లోనవుతుంటారు.తరచు తల్లిదండ్రులు గొడవ పడడం కుటుంబంలో డబ్బు సమస్యలు వంటివి పిల్లల దగ్గర చర్చించడం వంటి వాటి ద్వారా పిల్లలు మానసిక ఆలోచనలతో అధిక ఒత్తిడికి గురవుతుంటారు.
పిల్లలు అధిక ఒత్తిడికి గురైనప్పుడు, ఆకలి తగ్గడం, ఇతర ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం.తలనొప్పి లేదా కొత్తగా పక్క తడుపుట, చెడు కలలు రావడం, సరిగా నిద్ర లేక పోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు.
పిల్లలు అధిక ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే, ఇంట్లో తల్లిదండ్రులు వారితో కొంత సమయం పాటు గడపాలి.అంతే కాకుండా వారికి కొద్దిగా ప్రశాంతమైన వాతావరణంలో ఉండేలా చూసుకోవడం.
ముఖ్యంగా పిల్లల దగ్గర తల్లిదండ్రులు గొడవ పడటం మానేయాలి.
బాల్యంలో అధిక ఒత్తిడి, ఆందోళనకు గురైన వారిలో 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి వారిలో గుండె సమస్యలతో బాధ పడుతున్నారని అధ్యయనంలో వెల్లడైంది.
అందుకోసమే చిన్నతనంలో ఎంత ఆనందంగా, సంతోషంగా పెరుగుతారో వారు అంత ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.