ఓరి మీ దుంప తెగ.. పెళ్లి గిఫ్ట్‌గా డ్రమ్ ఇస్తారా.. వధువు రియాక్షన్ చూస్తే నవ్వాగదు!

పెళ్లి అంటే సందడి, సరదాలు మామూలే.కానీ ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ( Hamirpur, Uttar Pradesh )జరిగిన ఈ పెళ్లిలో మాత్రం ఒక వింత గిఫ్ట్ హైలైట్ అయింది.

 Wedding Gift Prank, Blue Drum Gift, Funny Wedding Gift, Viral Wedding Video, Bri-TeluguStop.com

పెళ్లికొడుకు ఫ్రెండ్స్ అతనికి గిఫ్ట్‌గా పెద్ద బ్లూ డ్రమ్ ఇచ్చారు.దాంతో పెళ్లికొడుకు షాక్ అవ్వడం, పెళ్లికూతురు నవ్వాగలేకపోవడం, చుట్టూ ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోవడం, ఒక్కటేమిటి, అన్నీ జరిగిపోయాయి.

జైమాల వేడుక అయిపోయాక కొత్త జంట స్టేజ్‌పై కూర్చుని బంధువులు, స్నేహితుల ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు.ఇంతలో పెళ్లికొడుకు స్నేహితులు కొందరు స్టేజ్‌పైకి పెద్ద బ్లూ డ్రమ్‌ను మోసుకొచ్చారు.

దాన్ని వాళ్లు గిఫ్ట్‌లాగా కొత్త జంటకు ఇచ్చారు.పెళ్లికొడుకు అయితే షాక్‌లో ఏం మాట్లాడాలో తెలీక అలా చూస్తుండిపోయాడు.

కానీ పెళ్లికూతురు మాత్రం ఆ డ్రమ్‌ను చూసి నవ్వాపుకోలేక పొట్టచెక్కలయ్యేలా నవ్వింది.అక్కడున్న ఎవరో ఈ ఫన్నీ సీన్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు.

ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది.నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. పెళ్లికొడుకు మొహం మాడ్చుకున్నాడని కొందరు కామెంట్ చేస్తే, పెళ్లికూతురు నవ్వు మాత్రం అదిరిపోయిందని ఇంకొందరు అంటున్నారు.“ఇక్కడి నుంచే అసలు పెళ్లి జీవితం మొదలవుతుంది” అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.“ఏం మెసేజ్ ఇస్తున్నారు గురూ ఈ బ్లూ డ్రమ్‌తో?” అని మరో నెటిజన్ సరదాగా ప్రశ్నించాడు.ఇదంతా సరదా కోసమే చేసిన ప్రాంక్ అయినా, ఈ బ్లూ డ్రమ్ మాత్రం అందరికీ మీరట్‌లోని ఒక భయంకరమైన కేసును గుర్తు చేసింది.

అక్కడ ఒక వ్యక్తిని ముక్కలుగా నరికి, ఇలాంటి బ్లూ డ్రమ్‌లోనే సిమెంట్ నింపి దాచారు.ఆ కేసుతో చాలామంది భర్తలకు బ్లూ డ్రమ్( Blue drum ) అంటేనే భయం పట్టుకుంది.

అప్పటినుంచి బ్లూ డ్రమ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది.మీమ్స్‌లో, జోక్స్‌లో వాడేస్తున్నారు.

ఏదేమైనా ఈ బ్లూ డ్రమ్ గిఫ్ట్ మాత్రం పెళ్లిలో ఒక్కసారిగా నవ్వులు పూయించింది.పెళ్లి మొత్తం మీద ఇదే హాట్ టాపిక్ అయిపోయింది.పెళ్లికొడుకు ఎక్స్‌ప్రెషన్స్, పెళ్లికూతురు నవ్వులు, ఊహించని గిఫ్ట్, వెరసి ఈ పెళ్లి మాత్రం అందరికీ బాగా గుర్తుండిపోయేలా చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube