సాధారణంగానే హీరోయిన్లు చాలా కమర్షియల్ అనే విషయం తెలిసిందే.సినిమాలలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంలో.
షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ సమయంలో డబ్బులు అడగడంలో కాస్త కమర్షియల్ గానే వ్యవహరిస్తున్నారు.అయితే ఇటీవలి కాలంలో అయితే పర్సనల్ లైఫ్ ని కూడా కమర్షియల్గా మార్చుకుంటున్నారు ఎంతోమంది హీరోయిన్లు.
వయసు మీద పడిన తర్వాత అవకాశాలు తగ్గిన తర్వాత లక్సరీ లైఫ్ ఎలా అని ఆలోచిస్తున్నారో ఏమో తెలియదు గానీ చివరికి మంచి బ్యాంక్ బాలన్స్ ఉన్న వ్యక్తులను టార్గెట్గా చేసుకుని ఇక రిలేషన్షిప్ కొనసాగిస్తున్నారు.కుదిరితే పెళ్లి కూడా చేసుకుంటున్నారు.
ముఖ్యంగా ఇటీవలి కాలంలో కుంభకోణాలు ద్వారా వార్తల్లో నిలుస్తున్న వారితోనే కొంతమంది హీరోయిన్లు సన్నిహితంగా ఉంటూ రిలేషన్ షిప్ కొన సాగిస్తూ ఉండడం సంచలనంగా మారింది.ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడుకోవాల్సిన వచ్చిందంటే ఇటీవల లలిత్ మోడీ తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుస్మితాసేన్ రిలేషన్షిప్ కాస్త గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
అయితే లలిత్ మోడీ ఐపీఎల్ స్కామ్ తో ఎంతలా వార్తల్లో నిలిచాడో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పటివరకు ఇండియాలో కూడా అడుగు కొట్టలేకపోయాడు.అయితే మాజీ విశ్వసుందరి ఇలా లలిత్ మోడీ తో డేటింగ్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
దీంతో మరికొంత మంది పేర్లు కూడా తెర మీదకు వస్తున్నాయి అని చెప్పాలి.తన అందంతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించే బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండెజ్.సినిమాల్లో ఈ అమ్మడికి అవకాశాలకు కొదవలేదు.
అయినప్పటికీ సుకేష్ చంద్రశేఖర్ అనే ఒక బడా బాబుతో రిలేషన్ షిప్ కు తెర లేపింది ఈ ముద్దుగుమ్మ.సుకేష్ చంద్ర శేఖర్ ఎవరో అందరికి తెలిసిందే.400 కోట్ల కుంభకోణంలో అడ్డంగా బుక్ బుక్ అయిన వ్యక్తి.ఈ కేసు ఈడీ చుట్టు తిరుగుతుంది అనే విషయం తెలిసిందే.
ఇక అప్పట్లో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న మందాకిని కూడా ఇలాంటి రిలేషన్ షిప్ ని కొనసాగించిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు.ఇంతకీ ఈ అమ్మడు ఎవరితో చెట్టపట్టాల్ వేసుకుని తిరిగింది అనుకుంటున్నారు.
వారు వీరు కాదు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీం తో ఎంతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చింది ఈ ముద్దుగుమ్మ.అప్పట్లో వీరి సాహిత్యం సంచలనంగా మారింది.
ఇక బాలీవుడ్ లో నటిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న మోనికా బేడి ఇలాంటి రిలేషన్షిప్ కొనసాగించింది అని చెప్పాలి.అప్పట్లో డాన్ గా మోస్ట్ వాంటెడ్ గా ఉన్న అబూసలేం తో ప్రేమలో పడింది ఈ ముద్దుగుమ్మా.ఈ ప్రేమ అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది.చివరికి ఈ ప్రేమ కారణంగా మోనికా బేడి జైలు పాలు కూడా అయింది.ఇలా ఇండస్ట్రీలోని హాట్ హీరోయిన్లు అందరూ కూడా కుంభకోణాల నేరస్తులతో నే ప్రేమలో పడుతూ ఉండడం గమనార్హం.