శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ కలిసి నటించిన సినిమా ఖడ్గం.ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
కృష్ణ వంశీ దర్శకత్వంలో దేశభక్తి కథాంశంతో వచ్చిన సినిమా ఖడ్గం.ఈ సినిమా 1990లో ముంబయిలో జరిగిన దాడుల్లో చాలామంది చనిపోవడంతో దానిని ఆధారంగా చేసుకొని చిత్రీకరించారు.
ఈ సినిమాను చేయాలనుకుంటే చిరంజీవి,బాలయ్య లాంటివాళ్లు ఓపెన్ అవకాశాలు ఇచ్చారు.అయితే ముగ్గురు స్టార్ హీరోలతో చేయడం కష్టం కావడంతో సెకండ్ హీరోలతో సినిమా చేయాలనుకున్నారు.
కాగా.ఈ సినిమాకి సుంకర మధు మురళి నిర్మాణానికి ఓకే చెప్పారంట.అయితే కథలో సత్యానంద్ సహకారం అందించగా ,డైలాగ్స్ నటుడు ఉత్తేజ్ రాశారు.అయితే మురారి మూవీతో తానే హీరోయిన్ గా ఎంట్రీ ఇప్పించిన సోనాలి బింద్రే తో పాటు సంగీత, కిమ్ శర్మ తదితర తారాగణం.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.అయితే పృథ్వి తన ఆర్ధిక పరిస్థితి బాగోలేదని క్యారెక్టర్ ఇవ్వాలని కోరగా, మంచి క్యారెక్టర్ ఉంది,నీ జీవితమే మారిపోతుంది అని కృష్ణ వంశీ చెప్పారంట.
ఇక ఈ సినిమాలో హీరోల విషయానికి వస్తే.ఈ సినిమాలో చేయడానికి రవితేజ ఒకే చెప్పగా.ప్రకాష్ రాజ్ కూడా ఓకే చెప్పారు.ఈ మూవీలో కీలక పాత్ర కోసం వెంకటేష్ ని అడిగితె ఫుల్ బిజీగా ఉన్నారు.
ఆ తరువాత నాగార్జున మన్మధుడు మూవీ అయ్యాక సర్జరీ ఉండడంతో కుదరదని చెప్పారు.
చివరికి శ్రీకాంత్ ఓకే చెప్పారు.అయితే ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ కాకుండా ఇంకొకరిని పెడితే మంచిదని, అవసరమైతే మరో కోటి రూపాయల బడ్జెట్ పెడతానని నిర్మాత అన్నారంట.
దానికి నేను శ్రీకాంత్ ని ఫిక్స్ అయ్యా,మీకు వద్దంటే మరో ప్రొడ్యూసర్ ని చూసుకుంటా అని కృష్ణ వంశీ స్పష్టంచేయడంతో నిర్మాత మురళి కాదనలేకపోయారు.ఈ సినిమా నవంబర్ 29న అన్ సీజన్ లో రిలీజైన ఈ మూవీకి కృష్ణవంశీ బ్రాండ్ ఇమేజ్,శ్రీకాంత్,రవితేజ క్రేజ్ తోడై సినిమా ఓపెనింగ్స్ అదిరిపోయాయి.అంతేకాదు.5 నంది అవార్డులు,మూడు ఫిలిం ఫేర్ అవార్డులు కూడా కైవసం చేసుకుంది.