1.జనసేన కు అండగా గల్ఫ్ జనసేన
జనసేన పార్టీ ఆదేశాల మేరకు గల్ఫ్ సేన ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9 న ‘ నా సేన కోసం నా వంతు కార్యక్రమాన్ని జూమ్ ద్వారా నిర్వహించింది.
2.డాలాస్ లో భారత్ బయోటెక్ ఎండీ
భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, నాట్కో ఫార్మానోటికల్ వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు డాలాస్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు.
3.లాటరీని గెలుచుకున్న ఇద్దరు భారతీయులు
దుబాయ్ లో నిర్వహించిన మహాజూజ్ లక్కీ డ్రా లో ఇద్దరు భారతీయుల ను అదృష్టం వరించింది.భారత్ కు చెందిన బిను, జినేష్ చెరో లక్ష దిర్హంస్ గెలుచుకున్నారు.
4.విదేశీయులకు మూడేళ్ల లోనే పౌరసత్వం : జర్మనీ
విదేశీయులకు మూడేళ్లలోనే పౌరసత్వం ఇచ్చే దిశగా జర్మనీ ఆలోచన చేస్తోంది.
5.ప్రపంచ సాహితీ తెలుగు సదస్సు
న్యూజిలాండ్ వేదికగా త్వరలో 8వ ప్రపంచ సాహితీ సదస్సు సెప్టెంబర్ 17, 18 అక్టోబర్ 2 వ తేదీన న్యూజిలాండ్ లో నిర్వహించనున్నారు.
6.భారత్ లో బ్రిటన్ హోం మంత్రి పూర్వీకుల భూమి ఆక్రమణ
బ్రిటన్ హోం మంత్రి సుయోలా బ్రవేర్మన్ పూర్వీకుల ఆస్తి ఆక్రమణకు గురైంది.దీంతో ఆమె తండ్రి గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
7.భారత్ నేపాల్ సరిహద్దుల్లో క్లౌడ్ బరస్ట్
భారత్ నేపాల్ సరిహద్దుల్లో అకస్మాత్తుగా కురిసిన వర్షంతో లాస్కో నది ఉప్పొంగింది.
మేఘ విస్పోటనం ద్వారానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు అధికార్లు తెలిపారు.ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, 30 ఇళ్లు ధ్వంసం అయ్యాయి.
8.బ్రిటన్ రాజు గా చార్లెస్ 3 ప్రకటన
బ్రిటన్ రాజు గా చార్లెస్ 3 అధికారికంగా యునైటెడ్ కింగ్డమ్ కు రాజు అయ్యారు.శనివారం ప్రవేశ మండలి ఆయన పేరుని ప్రకటించింది.
.