మహేష్ వాయిస్ వల్ల ముఫాసాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు .. సూపర్ స్టార్ రేంజ్ ఇదే!

హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్.( Mufasa The Lion King ) ప్రస్తుతం ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు.

 Mahesh Fans Made Mufasas Plan A Success Details, Mahesh Babu, Tollywood, Mufasa-TeluguStop.com

సోషల్ మీడియాలో ఈ సినిమా పేరు పెద్ద ఎత్తున వినిపిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) డబ్బింగ్ చెప్పాలి అని నిర్ణయించుకున్నప్పుడు చాలామంది ఎందుకు అవసరమా అని అనుకున్నారు.

ఒకవేళ సూపర్ స్టార్ మహేష్ బాబు గొంతు ఇచ్చినంత మాత్రాన ఈ మూవీకి ఒరిగేది ఏముంది అంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేశారు.అయితే అలా కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరు నోళ్లు మూయించారు మహేష్ బాబు.

ప్రసాద్ మల్టీప్లెక్స్ పీసీఎక్స్ స్క్రీన్ కు రెండు తెలుగు షోలు ఇచ్చారు.

Telugu Mahesh Babu, Mufasa, Mufasa Ticket, Rajamouli, Ssmb, Tollywood-Movie

అవి కనక ఫుల్ కాకపోతే ఇంగ్లీష్ కాదని ఇవి వేయడం వల్ల ఇలా జరిగిందని డిస్ట్రిబ్యూటర్ నిందిస్తాడు.ఇది యాజమన్యానికి కొంచెం ఇబ్బందే.తీరా చూస్తే ఇంగ్లీష్ కన్నా వేగంగా తెలుగు వెర్షన్ టికెట్లే త్వరగా అమ్ముడుపోయాయి.

తాజాగా సుదర్శన్ 35 ఎంఎం దగ్గర పెద్ద కటవుట్, బ్యానర్లు, హోర్డింగులతో అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు.ఏదో మహేష్ బాబే ముఫాసాలో నటించిన రేంజ్ లో సింహం బొమ్మకు ఘన స్వాగతం పలికారు.

హైదరాబాద్ లో మాత్రమే కాదు ఏపీ తెలంగాణ మెయిన్ సెంటర్స్ లో చాలా చోట్ల టికెట్లు త్వరగా బుక్ కావడానికి కారణం మహేష్ బాబే అవుతున్నాడు.

Telugu Mahesh Babu, Mufasa, Mufasa Ticket, Rajamouli, Ssmb, Tollywood-Movie

మాములుగా లయన్ కింగ్ బ్రాండ్ కు క్రేజ్ ఎక్కువ.దానికి ఈసారి గుంటూరు కారం( Guntur Karam ) రమణ గాడు తోడవ్వడంతో ఓపెనింగ్స్ అదిరిపోయేలా ఉన్నాయి.కేవలం మహేష్ బాబు ఈ సినిమాకు వాయిస్ ఇచ్చినందుకే థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు అభిమానులు.

అయితే ప్రస్తుతం ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి అంటే.తెలుగు సినిమాలు అయినా బచ్చల మళ్ళీ విడుదల పాటు టు, యుఐ సినిమాల కంటే ఈ సినిమాకి ఫాస్ట్ బుకింగ్స్ ఉన్నాయి.

చిన్నపిల్లల సినిమా అని పేరే కానీ పెద్దలు సైతం ఎగబడుతున్న వైనం కనిపిస్తోంది.రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29( SSMB 29 ) రావడానికి ఎంత లేదన్నా రెండేళ్లకు పైగా పడుతుంది కాబట్టి అప్పటిదాకా వచ్చే గ్యాప్ ని కొంతైనా పూడ్చుకునేందుకు ఫ్యాన్స్ ముఫాసాకు పోటెత్తుతున్నారు.

ప్రీమియర్ టాక్స్ పాజిటివ్ గానే ఉన్నాయి.మరీ ఎక్స్ ట్రాడినరి అనడం లేదు కానీ మంచి థియేటర్, సౌండ్ సిస్టమ్, త్రీడి ఉన్న చోట మాత్రం ఎంత మాత్రం నిరాశపరచదని అంటున్నారు.

ఇండియా వైడ్ రెండు వందల కోట్ల గ్రాస్ ఆశిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube