ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది జీవితంలోని చిన్న చిన్న విషయాలు అలవాట్లు, విజయాలు, వైఫల్యాలను నిర్వహిస్తూ ఉంటాయి.జీవితం పట్ల దృక్పథం కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి జీవితంలో డబ్బును సంపాదించగలడు.
చాణక్యుడి నీతి ప్రకారం డబ్బుకు సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి.ధనవంతులు కావాలంటే కొన్ని విషయాలను ఆచరిస్తే చాలు అని చాణక్యుడు చెబుతున్నాడు.
అయితే రోజువారి జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.చిన్నతనం నుంచి మీరు ఇంట్లో లేదా పాఠశాలలో సమయం విలువను నేర్చుకుంటారు.

చాణక్యుడు( Chanakya ) తన నీతి శాస్త్రంలో కూడా ఈ విషయాన్ని చెబుతున్నాడు.సమయం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు.సమయం అందరికీ ఒకేలా ఉంటుంది.కాలం ఏ ఒక్కరి కొరకు ఆగదు.ఒకసారి పోయిన కాలం తిరిగి రాదు.కాబట్టి ఈ సమయం విలువను అర్థం చేసుకున్న మనిషి జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు.
అలాగే ఎప్పుడు పనిమీద శ్రద్ధ పెడతాడు.తన లక్ష్యాలను చేరుకోవడానికి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునేవారు కచ్చితంగా విజయం సాధిస్తారని చాణక్యుడు వెల్లడించాడు.
చాణక్యుడి ప్రకారం సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి( Goddess Lakshmi ) టైమ్ విలువను అర్థం చేసుకున్న వారిపై తన అనుగ్రహాన్ని ఎప్పుడు ఉండేలా చేస్తుంది.

అలాంటి వ్యక్తులు సరైన సమయంలో సరైన పని చేస్తూ ఉంటారు.వారి మార్గం చాలా సులభంగా ఉంటుంది.జీవితంలో ఈ నియమాన్ని పాటించే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.
ఈరోజు చేసే పనిని రేపటి కోసం వాయిదా వేయడం లాంటివి చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోయే అవకాశం ఉంది.సమయం విలువను పాటించేవారి జీవితంలో డబ్బు, సంతోషం ఎప్పుడూ ఉంటాయి.
చాణక్యుడి ప్రకారం దేవాలయానికి ఎప్పటికప్పుడు దక్షిణ సమర్పించడం వల్ల దేవుని ఆశీర్వాదం కలిగి మీ సంపద పెరుగుతుంది.మీ ఇంట్లో పేదరికం దూరమైపోతుంది.ఎప్పుడు మీ పరిస్థితుల్లోనే మీ ఆర్థిక స్తోమతను బట్టి దానం చేస్తూ ఉండాలి.దానధర్మాలు చేయడం వల్ల మనిషి సంపద రెట్టింపు అవుతుంది అని పండితులు( Scholars ) చెబుతున్నారు.