ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది.మరి అలాంటి సందర్భంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇక చిరంజీవి( Chiranjeevi ) లాంటి నటుడు సైతం ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా( Pan India Movie ) చేస్తున్నాడు.మరి ఈ సినిమాతో ఆయనకు ఎలాంటి గుర్తింపు లభిస్తోంది.
తద్వారా ఆయన ఎలాంటి గొప్ప సినిమాని చేయబోతున్నాడు ఇక మీదట ఆయన చేయబోయే సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తయిన వెంటనే శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది… మరి వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో చిరంజీవి గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక మెగాస్టార్ చిరంజీవి ఇంతకుముందు చేసిన పాత్రలన్నింటినీ మించి ఈ సినిమాలో తన పాత్ర ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఆయన అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని అందుకొని మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక శ్రీకాంత్ ఓదెల మాస్ డైరెక్టర్ గా తనను తాను ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ రేంజ్ లో ఉండే విధంగా సినిమా చిత్రీకరిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక శ్రీకాంత్ ఓదెల ఒక సినిమాను మామూలుగా చేయడంలేదు ఆయన ఒక గొప్ప సినిమా చేయడానికే చాలా వరకు ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు…
.