జుట్టు ఒత్తుగా, పొడవుగా, నల్లగా పెరగాలనే కోరిక అందరికీ ఉంటుంది.కానీ, నేటి టెక్నాలజీ కాలంలో ఆహారపు అలవాట్లు, పోషకాల లోపం, కాలుష్యం, జీవన శైలిలో మార్పులు ఇలా రకరకాల కారణాల వల్ల దాదాపు అందరనీ హెయిర్ ఫాల్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది.
ఈ క్రమంలోనే హెయిర్ ఫాల్‌కి చెక్ పెట్టి.జుట్టును ఒత్తుగా పెంచుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది.
ఎన్నెన్నో షాంపూలు, కండీషనర్‌లు, ఖరీదైన ఆయిల్స్ వాడుతుంటారు.తరచూ హెయిర్ ప్యాక్స్ వేసుకుంటారు.
అయినప్పటికీ కొందరికి ఎలాంటి ఫలితం దక్కదు.
అయితే అలాంటి వారికి బొగ్గు (చార్‌కోల్) అద్భుతంగా సహాయపడుతుంది.
అవును, బొగ్గులో ఉండే కొన్ని శక్తి వంతమైన పోషకాలు హెయిర్ ఫాల్‌కి అడ్డు కట్ట వేసి.జుట్టును ఒత్తుగా పెంచుతాయి.
మరి ఇంతకీ బొగ్గును జుట్టుకు ఎలా వాడాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
తల స్నానం చేసేటప్పుడు మీరు వాడే షాంపూకు ఒక స్పూన్ బొగ్గు పొడిని కలిపి జుట్టు మొత్తానికి పట్టించాలి.ఐదు నిమిషాల అలా ఉండనిచ్చి.ఆపై బాగా రుద్దుకుంటూ గోరు వెచ్చని నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే గనుక.
జట్టు కుదుళ్లకు మంచిగా బలం అందుతుంది.తద్వారా జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

అంతేకాదు, షాంపూలో బొగ్గు పొడిని కలిపి జుట్టుకు రుద్దడం వల్ల చుండ్రు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు దూరం అవుతాయి.తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.తలలోని దుమ్ము, ధూళి తొలగి పోతాయి.మరియు ఆయిలీ హెయిర్ సమస్య నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.ఇక చివరిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.జుట్టుకు మీరు ఇంట్లో న్యాచురల్‌గా తయారు చేసుకున్న బొగ్గు పొడిని వాడొచ్చు.
లేదంటే మార్కెట్‌లో యాక్టివేటెడ్ చార్కోల్ పేరిట లభ్యమయ్యే బొగ్గు పొడినీ యూజ్ చేయవచ్చు.