తిరుమలలో జులై 26 విశిష్టత ఏమిటి.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పుణ్యక్షేత్రానికి( Tirumala ) ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తుంటారు.ఇంకా చెప్పాలంటే కొంతమంది భక్తులు స్వామి వారికి అభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.

 The Unique Pallavotsavam Ritual Will Be Observed In Tirumala On July 26 Details,-TeluguStop.com

అయితే తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎప్పుడూ భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది.స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నారాయణ గిరి వరకు రద్దీగా ఉంటుంది.

స్వామివారి సర్వదర్శనానికి ఏకంగా 24 గంటల సమయం పడుతుంది.ఈ సంఖ్య వారాంతపు సెలవులలో మరింత పెరుగుతుందని దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.

శుక్రవారం రోజు తిరుమల శ్రీవారిని దాదాపు 72,000 మంది భక్తులు దర్శించుకున్నట్లు దేవాలయ అధికారులు చెబుతున్నారు.అలాగే శుక్రవారం రోజు శ్రీవారి హుండీ ఆదాయం దాదాపు నాలుగు కోట్ల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం( TTD ) వెల్లడించింది.

స్వామివారికి 32,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.ఇంకా చెప్పాలంటే మైసూర్ మహారాజు జన్మించిన ఉత్తరభద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం జూలై 26వ తేదీన పల్లవోత్సవం( Pallavotsavam ) నిర్వహించనుంది.

ఇందులో భాగంగా సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు.

Telugu Bhakti, Devotional, Pallavotsavam, Srivenkateswara, Tirumala-Latest News

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూర్ సంస్థానం ప్రతినిధులు స్వామి అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు.మైసూర్ మహారాజు( Mysore King ) జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుంచి తిరుమలలో పల్లవోత్సవం జరుగుతుంది.మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అనేవారు.

ఈ ఉత్సవంలో కర్ణాటక సత్రాలకు విచ్చేసిన స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు.

Telugu Bhakti, Devotional, Pallavotsavam, Srivenkateswara, Tirumala-Latest News

అప్పట్లో దేవాలయ నిర్మాణానికి పలు సేవలకు ఎంతో దానం చేసిన మైసూర్ మహారాజు జ్ఞాపకార్థం శ్రీవారి దేవాలయంలో ప్రతి నెల ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున రాత్రి 7:30 నిమిషములకు ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు.అదే విధంగా శ్రీవారికి నిర్వహించే ఉగాది, దీపావళి ఆణివార ఆస్థానాలలో మైసూర్ మహారాజు పేరు ఉన్న ప్రత్యేక హారతి ఉంటుంది.శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్లోత్సవం పర్వదినాన కూడా శ్రీ మలయప్ప స్వామి వారు కర్ణాటక సత్రాలకు వేంచేపు చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube