వినాయకుడి విగ్రహాన్ని చాలా మంది భక్తులు తమ ఇళ్లల్లో పెట్టుకుంటారు.కాకపొతే చాలా మందికి ఇంట్లో ఏ ఏ ప్రదేశాల్లో ఎలాంటి గణేశుడి విగ్రహాన్ని పెడితే ధనంతో పాటు, ఆనందం విజయం ప్రాప్తిస్తాయి అనే విషయాలు పెద్దగా తెలియవు.
మీకు గనుక ఏ ఏ ప్రదేశాల్లో విగ్నేశ్వరుడి విగ్రహం పెట్టాలని తెలియకపోతే, వాస్తు ఆధారంగా క్రింద చెప్పబడిన సూచనలను తప్పక పాటించి ఆయా ప్రదేశాల్లో విగ్రహాన్ని పెట్టి సకల సౌభాగ్యాలను పొందండి.
· ఎవరైతే ఆనందాన్ని, శాంతిని మరియు సిరిసంపదలను కోరుకుంటారో అలాంటి వ్యక్తులు తెల్ల వినాయకుడిని ఇంటికి తెచ్చుకోవాలి.
తెల్ల వినాయకుడి చిత్రాన్ని తప్పక ఇంట్లో పెట్టుకోవాలి.

· ఎవరైతే స్వీయ అభివృద్ధి కోరుకుంటారో, అటువంటి వ్యక్తులు సిందూర వర్ణము వినాయకుడిని ఇంటికి తెచ్చుకొని ప్రతి రోజు పూజించాలి.

· ఇంట్లో పూజించుకోవడానికి కూర్చొని ఉన్న గణేషుడిని తెచ్చుకుంటే చాలా మంచిది.కూర్చున్న వినాయకుడిని మన ఇంట్లో పెట్టుకోవడం ద్వారా అదృష్టం మరియు విజయాలు మన జీవితంలో తిష్ట వేస్తాయి.

· కూర్చొని ఉన్న వినాయకుడి తొండం ఎడమ వైపుకి వంగి ఉన్న విగ్రహాన్ని ఇంట్లోనే పెట్టుకోవాలి.ఏ గణేశుని విగ్రహానికైతే తొండం కుడి వైపుకి వంగి ఉంటుందో ఆ విగ్రహం పెట్టుకుంటే, వినాయకుడి అనుగ్రహం పొందడం కష్టమవుతుంది.

· మీరు గనుక విగ్నేశ్వరుడు విగ్రహాన్ని పని చేస్తున్న దగ్గర పెట్టుకోదలిస్తే, నిలుచుని ఉన్న విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలనే విషయాన్ని మర్చిపోకండి.ఇలా పెట్టుకోవడం ద్వారా మీరు చేస్తున్న పనికి శక్తితో పాటు ఉత్సాహం తోడవుతుంది.

· ఎలుకతో పాటు, ఉండ్రాళ్లు కలిగి ఉన్న వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకుంటే… అది మీకెంతో పవిత్రతను చేకూరుస్తుంది.

· మీ పూజ గదిలో వినాయాక స్వామి విగ్రహాన్ని ఒక్కటి మాత్రమే పెట్టుకోండి.ఒకటి కంటే ఎక్కువ గనుక పెట్టుకున్నట్లైతే, విగ్నేశ్వరుడి భార్యలు రిద్ధి, సిద్ది నిరుత్సాహ పడతారు .

· గణేశునికి గడ్డి ని సమర్పించడం మాత్రం భక్తులు మర్చిపోకూడదు.గడ్డిని సమర్పించిన తర్వాత భక్తులు ఈ గణపతి మంత్రాన్ని తప్పక పఠించాలి.” ఓం గమ్ గణపతయే నమః “

· స్వస్తిక్ చిహ్నం వినాయక స్వామిదని చాలా మంది నమ్ముతారు.అందు చేత ఎవరైతే వాస్తుదోషం తో బాధపడుతుంటారో అటువంటి వ్యక్తులు ఇంట్లో స్వస్తిక్ చిహ్నాన్ని పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది.