చరణ్ మోస్ట్ ఏవైటెడ్ ‘RC15’ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా.. క్రేజీ బజ్ ఇదే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయాడు.ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ తో పాటు గ్లోబల్ వైడ్ గా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించు కున్నాడు.

 Interesting Update On Ram Charans Rc15 Release-TeluguStop.com

మరి ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తోనే ఇది సాధ్యం అయ్యింది అనే చెప్పాలి.ఈ సినిమాలో ఈయన నటనకు ప్రపంచ వ్యాప్తంగా సినీ లవర్స్ ఫిదా అయ్యారు.

ఈ సినిమా ఇచ్చిన విజయంతో ఇప్పుడు రామ్ చరణ్ మంచి లైనప్ సెట్ చేసుకుంటున్నాడు.ఈ సినిమా తర్వాత చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.వీరి కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘RC15’.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ప్రకటించగానే అంచనాలు పెరిగాయి.

Telugu Dil Raju, Shankar, Ram Charans Rc, Kiara Advani, Ram Charan, Rc, Upendra-

శంకర్ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తాయో అందరికి తెలుసు.మరి ఈ సినిమా స్టార్ట్ 70 శాతానికి పైగానే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.అయితే ఈ సినిమా మహా అంటే ఒక నెల షూట్ మరో నెల పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం కేటాయిస్తే సరిపోతుంది.

అందుకే ఈ సినిమా ఈ సమ్మర్ లోనే రిలీజ్ చేస్తారు అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

Telugu Dil Raju, Shankar, Ram Charans Rc, Kiara Advani, Ram Charan, Rc, Upendra-

మొన్నటి వరకు ఈ సినిమా సమ్మర్ అనే అంతా ఫిక్స్ అయ్యారు.కానీ తాజాగా ఈ మోస్ట్ ఏవైటెడ్ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వచ్చేసింది.ఈ మాసివ్ ప్రాజెక్ట్ అయితే వచ్చే ఏడాదే రాబోతుంది అని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తాజా టాక్.

మరి వారి కారణాలు ఏంటో తెలియదు కానీ ఆల్రెడీ షూట్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది మొత్తం ఆగాల్సిందే అంటున్నారు.ఇక దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube