ఎగ్జిట్ పోల్స్, ముందస్తు అంచనాలను తలక్రిందులు చేస్తూ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అమెరికా అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు.త్వరలోనే ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇందుకోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.స్వింగ్ స్టేట్స్‌తో పాటు కీలక రాష్ట్రాలను హస్తగతం చేసుకోవడం ద్వారా ట్రంప్(Trump) తన లక్ష్యాన్ని చేరుకున్నారు.
మెజారిటీ అమెరికన్లు, యువత, వలసదారులు కూడా ట్రంప్ నాయకత్వాన్ని అంగీకరించారు.వరుస యుద్ధాలు, అధిక ద్రవ్యోల్బణంతో విసుగు చెందిన జనం ట్రంప్ వైపు మొగ్గుచూపారు.
2020 జనవరి 6న యూఎస్ క్యాపిటల్(US capital) వద్ద హింసాత్మక తిరుగుబాటు తర్వాత ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ట్రంప్.అమెరికా చరిత్రలోనే గతంలోనూ ఎన్నడూ చూడని విధంగా వైట్‌హౌస్‌లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నారు.ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికలపై సిఖ్స్ ఫర్ ట్రంప్ వ్యవస్థాపకుడు , భారత సంతతికి చెందిన జస్దీప్ సింగ్ జెస్సీ(Jasdeep Singh Jesse) స్పందించారు.పేలవమైన విదేశీ విధానాలు, అధిక ద్రవ్యోల్భణం, నియంత్రణ లేని నేరాలు, అక్రమ వలసలు , ప్రజానీకానికి సంబంధం లేని సామాజిక సమస్యలపై బైడెన్ – హారిస్ దృష్టి సారించడం వల్లే ట్రంప్ వైపు ఎక్కువ మంది నిలబడ్డారని తెలిపారు.
నాలుగేళ్లుగా బైడెన్ – హారిస్‌లపై(Biden ,Harris )దాచుకున్న కోపాన్ని ప్రజలు ఎన్నికల్లో చూపించారని , ట్రంప్ కేవలం ఎలక్టోరల్ కాలేజీని మాత్రమే కాకుండా పాపులర్ ఓటును కూడా దక్కించుకున్నారని జెస్సీ చెప్పారు.ట్రంప్ నాయకత్వంలో రిపబ్లికన్ పార్టీకి ప్రతినిధుల సభ, సెనేట్‌లో మెజారిటీ లభించిందన్నారు.అధ్యక్షుడిగా భారత్ – అమెరికా(India – America) సంబంధాలను బలోపేతం చేయడానికి ట్రంప్ (trump)కృషి చేస్తారని జెస్సీ అభిప్రాయపడ్డారు.భారత్‌ను విలువైన భాగస్వామిగా ఆయన చూస్తున్నాడని, ప్రధాని నరేంద్ర మోడీతో ట్రంప్‌కు(Trump with Narendra Modi) వ్యక్తిగతంగానూ అనుబంధం ఉందని .ఇది రెండు దేశాలకు సానుకూల పరిణామమని జస్దీప్ సింగ్ జెస్సీ ఆకాంక్షించారు.