వైరల్.. గోరుపై నెహ్రూ చిత్రపటం

చాలామంది కళాకారులు ఉన్న దేశం భారతదేశం.నటన వృత్తి నైపుణ్య కళాకారులు ఎందరో మనదేశంలో ఉన్నారు.

 Viral.. Nehru's Picture On The Nail, Viral,nehru's Picture ,on The Nail, Viral L-TeluguStop.com

అందులో సూక్ష్మ వస్తువులను తయారు చేసే కల కూడా ఓ నైపుణ్యమే.అలాగే దేశంలో అనేకమంది పేరు మోసిన చిత్రకళాకారులు ఉన్నారు.

భారతదేశంలో తయారు చేసిన ఎన్నో వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది.ఇకపోతే తాజాగా ఓ ఉపాధ్యాయుడు తన చేతి వేలిపై రాబోయే జవహర్ లాల్ నెహ్రూ(Jawahar Lal Nehru) పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రపటాన్ని బొటనవేలు గోరుపై వేసుకున్నాడు.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు గురించి చూస్తే.

Telugu Nalgonda, Nehrus Picture, Nehruspicture, Nail, Telangana, Telugu National

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో (Nalgonda District)కనగల్ మండలం బుడమర్లపల్లి గ్రామానికి చెందిన కారింగు జానయ్య గౌడ్ తన కుడిచేతి బొటనవేలు గోరుపై భారతదేశ తొలి ప్రధాని నెహ్రు(Nehru) జన్మదిన (నవంబర్ 14 ) సందర్భంగా.నెహ్రూ చిత్రపటాన్ని పెయింటింగ్ వేశారు.గతంలో కూడా తన బొటనవేలు గోరుపై ఎన్నో చిత్రాలను పెయింటింగ్ వేసి తెలుగు బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ తెలంగాణ బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్(Telugu Book of National Record Telangana Book of State Record) లో చోటు సంపాదించుకున్నాడు ఆయన.ప్రస్తుతం ఆయన గోరు సైజు రెండు సెంటీ మీటర్ల వెడల్పు, 11 సెంటీమీటర్ల పొడవు ఉంది.జానయ్యలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కనగల్లులో డ్రాయింగ్ టీచర్ గా ఆయన పనిచేస్తున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కళాకారుడైన ఉపాధ్యాయుడని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

నిజంగా అతని నైపుణ్యం అమోఘం అంటూ కామెంట్ చేస్తుండగా మరి కొందరేమో.మీ కళాకార నైపుణ్యానికి హాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube