ఇటీవల కాలంలో చాలా మంది దంపతులు సంతాన లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు.స్త్రీ, పురుషుల్లో ఉండే కొన్ని సమస్యల కారణంగా సంతాన లేమి ఏర్పడుతుంది.
దీంతో సంతానం కోసం హాస్పటల్స్ చుట్టూ, గుడుల చుట్టూ తిరుగుతూ ఎంతగానో కృంగిపోతుంటారు.ఎన్నో మందులు వాడుతుంటారు.
అయితే సంతానం కోసం మందులు వాడటమే కాదు.తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి.
కొన్ని కొన్ని ఆహారాలు సంతాన లేమిని నివారించడంలో గ్రేట్‌గా సహాయపడతాయి.
అలాంటి వాటిలో దానిమ్మ టీ కూడా ఒకటి.
సీజన్లతో సంబంధం లేకుండా ఎప్పుడూ దొరికే దానిమ్మ పండ్లలో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి.అటువంటి దానిమ్మ పండ్లతో టీ తయారు చేసుకుని తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ పొందొచ్చు.
ఒక గ్లాస్ హాట్ వాటర్లో దానిమ్మ రసం, రెండు స్పూన్ల దానిమ్మ గింజలు, నిమ్మ రసం మరియు రుచి కోసం తేనె కలిపుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఈ దానిమ్మను టీని ఒక కప్పు చప్పున తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ముఖ్యంగా సంతాన లేమితో బాధ పడే దంపతులు దానిమ్మ టీని ప్రతి రోజు రోజు తీసుకుంటే.అందులో ఉండే పోషకాలు సంతాన సాఫల్యతను పెంచుతాయి.మహిళల్లో గర్భాశయ వ్యాధులను నివారించే దానిమ్మ టీ.పురుషుల్లో వీర్య వృద్ధిని పెంచుతుంది.అలాగే భార్యభర్తలిద్దరిలోనూ లైంగిక కోరికలను పెంచుతుంది.కాబట్టి, పిల్లలు కావాలనుకునే దంపతలకు ఖచ్చితంగా తమ డైలీ డైట్‌లో దానిమ్మ టీ చేర్చుకుంటే మంచిది.
ఇక దానిమ్మ టీని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల.శరీరంలో అదనపు కొవ్వు కరిగుతుంది.
దాంతో వెయిట్ లాస్ అవుతాయి.అంతేకాదు,దానిమ్మ టీ తీసుకోవడం వల్ల దంత సమస్యలు తగ్గుతాయి.
ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.చర్మం యవ్వనంగా, కాంతి వంతంగా మారుతుంది.
బ్రెయిన్ షార్ప్‌గా కడా మారుతుంది.
.