జయలలిత( Jayalalithaa ).ఈ పేరు చెప్పగానే అందరు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అని పొరపాటు పడతారు.
కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, వ్యాంప్ పాత్రల్లో నటించి ప్రస్తుతం బుల్లి తెరపైన బిజీ ఆర్టిస్ట్ గా ఉన్న జయలలిత కూడా అందరికి సుపరిచితమే.ప్రస్తుతం ఆమె కెరీర్ బుల్లి తెరపై బాగా బిజీ గా కొనసాగుతుంది.
అయితే ఆమె మొదటి నుంచి ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద చెప్పేయడం అలవాటు ఉన్న వ్యక్తి.అందుకే ఆమె జీవితంలో ప్రేమ, పెళ్లి వల్ల తాను ఎన్ని ఇబ్బందులు పడింది అనే విషయాలను ఎలాంటి బెరుకు లేకుండా చెప్పేస్తూ ఉంట్టుంది.
ఇటీవల కాలంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తాను ఎలా పెళ్లి వల్ల ఇబ్బందులు పడిందో ఏకరువు పెట్టింది.

తాను తన భర్త నుంచి విడిపోవాలని తన తల్లిదండ్రులు పూజలు చేసారని, వారి పూజల ఫలితం ఏమో కానీ తాను మాత్రం పెళ్ళైన ఏడాదికే నరకం చూశానని, ఏడేళ్ల లవ్ ఏడాది కాపురం తో భయంకరంగా మారిపోయిందని తెలిపింది.మా జంటను చుసిన ఎవరైనా నోరెళ్ళ బెట్టే వారని, అస్సలు ఈ అమ్మాయి అలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకుంది అని మొహం మీదే అడిగేవారని, చూడటానికి ఇంత బాగున్నావ్ ఈ ఉడతలు పెట్టేవాడు నీకెక్కడ దొరికాడా అంటూ స్నేహితులు కూడా తిట్టేవారని చెప్పుకోచ్చింది.తనకు ఒక రోజు బాగా కొట్టి రూమ్ లో లాక్ వేస్తే నన్ను విడిపించడానికి చలపతి రావు, పరుచూరి గోపాల కృష్ణ( Chalapathy Rao, Paruchuri Gopala Krishna ) వచ్చారని, వారితో తనను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైన్ట్ ఇచ్చారని తెలిపింది.

ఆ రోజు వారు లేకపోతే నేను ఏమై పోయి ఉండేదాన్నో తలుచుకుంటే భయం వేస్తుందని చెప్పింది జయలలిత.ఆ భయం వల్లే ఈ రోజుకి ఇంకా పెళ్లి( wedding ) చేసుకోకుండా ఉండిపోయాను అని, అమ్మానాన్నలను చూసుకుంటూ గడిపేశాను అని, ఇకపై కూడా ఒంటరిగా ఉండటానికే నిర్ణయించుకున్నానని తెలిపారు.జీవితం అంత సినిమా కోసమే బ్రతికానని, ఇప్పుడు కేవలం నాతో తౌడుగా ఉంది కేవలం ఆ బాబా మాత్రమే అంటూ జయలలిత కన్నీటి పర్యంతం అయ్యింది.