ముఖ్యంగా చెప్పాలంటే మరణించిన వారు ఆత్మ రూపంలో పితృ లోకంలో ఉంటారని చాలామంది ప్రజలు నమ్ముతారు.ఆ ఆత్మ( Soul ) తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి భూమి మీద జీవాత్మగా వస్తుంది.
అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి శుక్ల కణంగా మారి శ్రీ గర్భకోశంలో ప్రవేశించి శిశువుగా( Baby ) రూపాంతరం చెంది భూమి మీదకు వస్తుంది.మరణించిన పితృ దేవతలకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి.
అలా జరగాలంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి.అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి.
అది రక్తం పంచుకో పుట్టిన పుత్రులే అందించాలి.అప్పుడే వారికి పితృ రుణం తీరుతుంది.
పుత్రులు రుణం తీర్చుకుంటేనే పితృదేవతలకు మోక్షం లభిస్తుంది.

ఈ రుణం తీర్చుకునేందుకు ఈ 15 రోజులు ఎంతో ప్రత్యేకమైనవి అని పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే మరణించిన వారికి పితృపక్షంలో తర్పణ, శ్రాద్ధ, కార్యాలు నిర్వహించడం నియమం.ఈ సమయంలో శ్రాద్ధం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు( Ancestors ) శాంతి లేదా మోక్షం కలుగుతుందని నమ్ముతారు.
ఈ విషయాన్ని మత గ్రంథాలలో కూడా వెల్లడించారు.ఈ 15 రోజుల సమయం పూర్తిగా పూర్వీకులకు అంకితం చేసినందుకు ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదు.అయితే పితృపక్షంలో( Pitru Paksha ) బిడ్డ పుడితే దాని అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.పితృపక్షంలో ఏ కుటుంబంలోనైనా సంతానం కలిగితే అది శుభప్రదంగా పరిగణించాలి.

అలాంటి పిల్లలు ఆ కుటుంబానికి ఎంతో ప్రత్యేకం అని పండితులు చెబుతున్నారు.పితృపక్షంలో పుట్టిన పిల్లలు తమ కుటుంబానికి చెందిన పూర్వీకుల ఆశీస్సులతో పుడతారని నిపుణులు చెబుతున్నారు.అలాంటి పిల్లలు తమ జీవితంలో మంచి పురోగతిని సాధిస్తారని చెబుతున్నారు.అలాంటి పిల్లలు తమ పూర్వీకులలోని కొన్ని లక్షణాలను కలిగి ఉంటారు.పితృపక్షంలో పూర్వీకుల ఆశీర్వాదంతో( Ancestors Blessings ) పుట్టిన పిల్లలు సృజనాత్మకంగా ఉంటారు.ఈ సమయంలో పుట్టిన వారు సమాజంలో ఉన్నతనమైన స్థితిలో ఉంటూ గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతారు.
అలాగే పితృపక్షంలో పూర్వీకుల ఆశీస్సులు అందుకొని జన్మించిన పిల్లలు చాలా తెలివైన వారు.వారి తెలివితేటల వల్ల కుటుంబ కీర్తి నలువైపులా వ్యాపిస్తుంది.
పితృపక్షంలో జన్మించిన పిల్లలు వారి పూర్వీకుల ఆశీస్సులతో పుట్టడమే కాకుండా ఆ కుటుంబానికి చాలా అదృష్టాన్ని తెస్తారు.