భాగ్యనగరంలో శివరాత్రి మహోత్సవాలు కనులపండుగగా సాగాయి.హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని కాంచీపురం వరమహాలక్ష్మీ సిల్క్ ప్రాంగణంలో రాజేష్ నాథ్ జీ అఘోరా ఆధ్వర్యంలో లింగాభిషేకం, శివారాధన నిర్వహించారు.
ప్రతి ఏటా లోకకళ్యాణార్థం శివరాత్రి పర్వదినం రోజున ప్రత్యేక శివలింగం ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నామని డైరెక్టర్ కళ్యాణ్ తెలిపారు.
ఈ ఏడాది రాజేష్ నాథ్ జీ అఘోరాతో లింగాభిషేకం, శివారాధన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు దేశం నుంచి కరోనా వెళ్ళిపోవాలని… ప్రజలంతా సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో మెలగాలని పూజలు నిర్వహించినట్లు కళ్యాణ్ తెలిపారు.