శివ భక్తులు ప్రతి రోజూ పరమాశివుని పూజిస్తూ ఉంటారు.అయినప్పటికీ నెల నెల వచ్చే మాస శివరాత్రికి, మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
శివునికి భక్తులు నిర్మలమైన హృదయంతో జలం, బీల్వ పత్రం సమర్పిస్తే చాలు కొలిచిన భక్తుల కోరికలు తీర్చే బోళ శంకరుడు.అయితే శని పూజకి మాత్రమే కాకుండా శివాలయంలో చేసే ప్రదక్షిణ కు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.
శివాలయంలో ప్రదక్షిణ చేసే విధానం శివ పురాణంలో వెల్లడించారు.
అయితే శివలింగానికి ప్రదక్షిణలకు సంబంధించిన నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేవాలయంలో దేవతలను పూజించిన తర్వాత లేదా ఆలయంలో దర్శనం కోసం వెళ్ళిన తర్వాత కచ్చితంగా ప్రదక్షిణ చేస్తారు.అంతే కాకుండా శివాలయంలో చేసే ప్రదక్షిణ అన్ని దేవాలయాలలో చేసే ప్రదక్షిణ కు భిన్నంగా ఉంటుంది.
అంతే కాకుండా ఇతర ఆలయాల్లో చేసే విధంగా ప్రదక్షిణ ఈశ్వరుని దేవాలయంలో చేయకూడదు.పరమశివుని ఆలయంలో ఏ విధంగా ప్రతిక్షణా చేయాలో లింగ పురాణంలో స్పష్టంగా వెల్లడించారు.

శివాలయంలో చేసే ప్రదక్షిణ ను చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని పిలుస్తారు.చండీ ప్రదక్షిణ అంటే ఏమిటి ఆ ప్రదక్షణ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలను పొందవచ్చు, ఇప్పుడు తెలుసుకుందాం.శివాలయంలో ధ్వజస్తంభం నుంచి ప్రదక్షిణ మొదలుపెట్టి, చండీశ్వరుని వరకు వెళ్లి అక్కడ చండీశ్వరుని దర్శించుకుని తిరిగి మళ్లీ ధ్వజస్తంభం వద్దకు చేరుకోవాలి.

ఆ తర్వాత ధ్వజస్తంభం వద్ద ఒక క్షణం ఆగి మరలా ప్రదక్షిణ మొదలుపెట్టి, సోమసూత్రం అభిషేక జలం వెళ్లేదారి వరకు, అక్కడి నుంచి తిరిగి మళ్ళీ నందీశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లు అర్థం.ఈ విధంగా చేసే ప్రదక్షిణ ను చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు.ఇలా ప్రదక్షిణ చేసే సమయంలో సోమసూత్రన్ని దాటి అసలు వెళ్ళకూడదు.
చండీ ప్రదక్షిణం, సాధారణ ప్రదక్షిణాల కంటే పదివేల ప్రదక్షిణలతో సమానమని ఈ లింగ పురాణంలో ఉంది.ఇలా మూడు ప్రదక్షణలు చేయాలి.