హనుమాన్ జయంతి శుభ ముహూర్తం, పూజా విధానం ఇదే..!

ముఖ్యంగా చెప్పాలంటే హనుమాన్ జయంతి( Hanuman Jayanthi ) అనేక శుభ యోగాలతో వచ్చింది.ఈరోజున చిత్తా నక్షత్రం, వజ్రయోగం కూడా ఉంటుంది.

 Hanuman Jayanthi Shubha Muhurtham Pooja Process Chanting Mantras Details, Hanuma-TeluguStop.com

అలాగే గ్రహాల స్థానం వల్ల గురు, ఆదిత్య రాజయోగం, పంచ మహాపురుష యోగం, మాలవ్య యోగం, శశయోగం కూడా ఉన్నాయి .అయితే 23వ తేదీన ఉదయం 6:06 గంటల నుండి 7:40 నిమిషాల వరకు హనుమంతుడి ఆరాధనకు మంచి ముహూర్తం ఉందని పండితులు తెలిపారు.అలాగే ఈ రోజున అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:00 గంటల నుండి 12: 53 నిమిషముల వరకు ఉంటుంది.ఇక ఆ రోజున బ్రహ్మ ముహూర్తంలో( Brahma Muhurtam ) నిద్రలేచి స్నానం చేసిన తర్వాత, శుభ్రమైన దుస్తులు ధరించాలి.

అలాగే హనుమంతుడికి ఇష్టమైన ఎరుపు లేదా కాషాయం రంగు దుస్తులు మాత్రమే ధరించాలి.హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు సులభమైన మార్గం శ్రీరామ నామాన్ని జపించడం.అయితే రామనామాన్ని( Ramanamam ) జపించడానికి ప్రత్యేక నియమం అంటూ ఏమీ లేదు.రామనామాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా రామ నామాన్ని జపించవచ్చు.అలాగే హనుమంతుడి అనుగ్రహం పొందాలంటే కూడా సుందరకాండ పారాయణం చేయాలి.ఇలా చేయడం వలన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.

ఆ రోజున ఇక హనుమంతుడిని ధ్యానించుకుంటూ ఉండాలి.హనుమాన్ ఆలయానికి( Hanuman Temple ) వెళ్లి విగ్రహానికి కుంకుమ రాయాలి.అంతేకాకుండా హనుమాన్ చాలీసా చదవడం, బజరంగబన్ పఠించడం వలన అంతా మంచి జరుగుతుంది.హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన అరటిపండు, శనగపిండి లేదా బూందీ తో చేసిన లడ్డులు సమర్పించడం చాలా శుభప్రదం.

అలాగే పూజ సమయంలో ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube