మకర జ్యోతి వెనుక ఉన్న రహస్యం గురించి మీకు తెలుసా..

ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా శబరిమలకు అయ్యప్ప స్వామి భక్తులు భారీ ఎత్తున ప్రతిరోజు తరలి వెళ్తున్నారు.శబరిమల అంటే మొదటిగా గుర్తొచ్చేది మకరజ్యోతి.

 Do You Know The Secret Behind Makara Jyothi , Makara Jyothi , Ayyappa Swamy , De-TeluguStop.com

అయితే మకర సంక్రాంతి రోజున మకర జ్యోతిని చూసి ఎందుకు లక్షదిమంది భక్తులు అయ్యప్ప దీక్ష చేసి మకర జ్యోతిని దర్శించడానికి వస్తూ ఉంటారు.ఈ మకర జ్యోతిని అయ్యప్ప స్వరూపమని భక్తుల గట్టి నమ్మకం.

అయితే మకర జ్యోతి గురించి చాలామందికి విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి.కొందరు దీనిని విస్మయం అని అంటారు.

మరి కొందరు మోసం అని కూడా అంటారు.అయితే 1999 మరియు 2010లో ఈ జ్యోతి దర్శనం చేసుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో అక్కడ జరిగిన తొక్కిసిలాటలో చాలామంది మరణించారు.

ఇంకా చెప్పాలంటే ఇలా జరిగిన తర్వాత మకర జ్యోతి అనేది కొందరు స్వార్థం కోసం సృష్టించిన మూడు నమ్మకం అని వాదించడం కొంతమంది ప్రజలు ప్రారంభించారు.దానివల్ల మకర జ్యోతి విషయంపై చాలా వివాదాలు జరిగి ఆ వివాదాలు కోర్టు వరకు వెళ్లడం జరిగింది.

దానివల్ల కేరళ హైకోర్టు ఈ వివాదాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి కోర్టుకు సబ్మిట్ చేయాలని పోలీసులకు ఆదేశాలను జారీ చేసింది.దీనివల్ల పోలీసులు దేవాలయాల సిబ్బంది వద్ద వివరాలను తీసుకుని సబ్మిట్ చేసినట్లు సమాచారం.

అయితే అందులో ఏముందంటే దేవాలయం పూర్వ దిక్కున ఉన్న కొండపై కొంతమంది గిరిజనులు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు.

Telugu Ayyappa Swamy, Devotional, Kerala, Makara Jyothi, Sabarimala, Sankranti-T

పురాణాల ఆధారంగా చూస్తే అయ్యప్ప స్వామి మహిషాన్ని చంపి ఆ గిరిజనులను కాపాడేందుకుగాను ఆ కొండపై పెద్ద ఎత్తున ఒక జ్యోతిని రాత్రి పూట వెలిగిస్తారని ఇక జ్యోతిని చూసిన వెంటనే పందాల వంశస్థులు అయ్యప్ప స్వామికి బంగారు ఆభరణాలు తెస్తారని చెబుతూ ఉంటారు.దేవాలయ కమిటీ మరియు ధర్మాధికారులు ఈ ఆచారాన్ని ఆచరిస్తూ వస్తున్నారు అని దేవాలయ ముఖ్యపుజారి చెప్పారు.దీన్నే అయ్యప్ప స్వామి జ్యోతిగా, మకర జ్యోతిగా పిలుస్తూ ఉంటారు.

దీని వల్ల అప్పటినుంచి ఇప్పటివరకు జ్యోతి దర్శనం క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube