సెప్టెంబర్ 19వ తేదీన ఏ సమయంలో వినాయకుడిని పూజించాలో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో సెప్టెంబర్ 19వ తేదీ నుంచి గణేష్ చతుర్థి వేడుక( Ganesh Chaturthi ) మొదలవుతుంది.శుక్ల పక్ష చతుర్ధి తిధి సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషములకు మొదలవుతుంది.

 Ganesh Chaturthi 2023 Puja Muhurat,ganesh Chaturthi ,lord Ganesha,vinayaka Chavi-TeluguStop.com

ఇది మరుసటి రోజు సెప్టెంబర్ 19వ తేదీన రాత్రి 8 గంటల 43 నిమిషముల వరకు ఉంటుంది.అనంత చతుర్థి సరిగ్గా 10 రోజుల తర్వాత సెప్టెంబర్ 28వ తేదీ వరకు జరుగుతుంది.

గణేష్ ఉత్సవం సెప్టెంబర్ 19 నుంచి 28 వ తేదీ వరకు జరుగుతుంది.దేశంలోని వివిధ నగరాలు, గ్రామాల ప్రజలు వినాయకుడి విగ్రహాన్ని పెట్టి ఆరాధిస్తారు.

ఆ తర్వాత గణపయ్య( Lord Ganesha )ను మన స్ఫూర్తిగా పూజిస్తారు.

Telugu Bhakti, Devotional, Ganeshchaturthi, Ganesh Pooja, Lord Ganesha-Latest Ne

దాదాపు పది రోజుల పాటు ఆయనను పూజించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు.గణపతి ప్రతిష్టాపన( Ganesh Pratishthapana ) రోజు ఎంతో పవిత్రమైనది.ఇంకా చెప్పాలంటే పవిత్రమైన రోజున చేసే పని విజయవంతంగా, శుభప్రదంగా ఉంటుంది.అటువంటి పరిస్థితిలో గణపతి బప్పాను ఇంటికి తీసుకొని వచ్చి ప్రతిష్టించడానికి సెప్టెంబర్ 19వ తేదీన ఉదయం 11.07 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1.34 నిమిషముల వరకు శుభ సమయం( Shubh Muhurt ) ఉంటుంది.సుమారు రెండు గంటల పాటు గణపతి బప్పాల ప్రతిష్టాపనకు శుభ ముహూర్తం ఉంటుంది.

ఈ సమయంలో దేవుడిని ఇంటికి తీసుకురావడం చాలా శ్రేయస్కరం అని పండితులు చెబుతున్నారు.

Telugu Bhakti, Devotional, Ganeshchaturthi, Ganesh Pooja, Lord Ganesha-Latest Ne

మీరు కూడా మీ ఇంట్లో గణపతిని ప్రతిష్టించాలంటే ఈ పద్ధతిని పాటించడం ఎంతో మంచిది.ముందుగా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి.భగవంతుని విగ్రహాన్ని( Lord Ganesh Statue ) అవసరమైన చోట ప్రతిష్టించవచ్చు.

ఈ ప్రాంతాన్ని శుభ్రం చేసిన తర్వాత ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని ఆ ప్రదేశంలో ఉంచాలి.ఆ తర్వాత దుర్వ గడ్డి నుంచి గంగాజలాన్ని చల్లాలి.

గణపతి బప్పా కు పసుపు, బియ్యం, చందనం, మౌళి, మోదకం, పండ్లు, పువ్వులు సమర్పించాలి.దీని తర్వాత శివున్ని మరియు తల్లి పార్వతిని పూజించి వినాయకుడికి సమర్పించడం ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube