అమెరికా: భారతీయుల జీవితాలు అల్లకల్లోలం.. వీసాల గందరగోళంతో ఆందోళన.. అసలేం జరుగుతోంది?

అమెరికాలో (America)ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడాలని కలలు కంటున్న భారతీయులకు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తీసుకొచ్చిన ఓ నిర్ణయం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.హెచ్-1బీ, ఎల్1 వీసాల(H-1B and L1 visas) మీద అమెరికాలో ఉంటున్న భారతీయుల పిల్లలకు పుట్టుకతో వచ్చే పౌరసత్వం ఇకపై దక్కదని ట్రంప్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి గ్రీన్ కార్డ్ లేదా అమెరికా పౌరసత్వం ఉంటేనే పిల్లలకు సిటిజెన్ షిప్ వస్తుంది.ఫిబ్రవరి 19 తర్వాత పుట్టిన పిల్లలందరికీ ఈ కొత్త రూల్ వర్తిస్తుంది.

 America: The Lives Of Indians Are In Turmoil.. Concern Over Visa Confusion.. Wha-TeluguStop.com

ఇది చాలా మంది భారతీయ కుటుంబాల భవిష్యత్తును చీకటిలోకి నెట్టేస్తోంది.

చాలామంది ఎన్నారైలు తమ పిల్లలు అమెరికాలో పుడితే ఆటోమేటిక్‌గా పౌరులవుతారని, తద్వారా తమ కుటుంబాల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని ఆశించారు.

కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య 10 లక్షలు దాటిపోయింది.

చాలామంది దశాబ్దాలుగా వెయిట్ చేస్తున్నారు.పిల్లలకు 21 ఏళ్లు నిండిన తర్వాత కూడా అమెరికా పౌరసత్వం రాకపోతే, వారు చట్టబద్ధంగా ఆ దేశంలో ఉండటానికి వీలుండదు.

అంటే, వారు అమెరికాను విడిచి వెళ్లాల్సి రావచ్చు లేదా ఉండటానికి వీసా కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఇది వారి భవిష్యత్తును అగమ్యగోచరం చేస్తుంది.

Telugu Citizenship, Donald Trump, Executive, Green Backlog, Visa, Policy, Indian

ఈ కొత్త విధానం రెండు వర్గాల పిల్లలను లక్ష్యంగా చేసుకుంది.మొదటిది, అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు.రెండోది, హెచ్-1బీ, ఎల్1 వీసాలపై ఉండి, గ్రీన్ కార్డ్ లేదా అమెరికా పౌరసత్వం లేని తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు.గతంలో, పిల్లలు అమెరికాలో పుడితే పౌరసత్వం వస్తుందని, ఆ తర్వాత గ్రీన్ కార్డ్ కూడా వస్తుందని చాలామంది నమ్మారు.కానీ ఇప్పుడు ఆ దారి మూసుకుపోయింది.హెచ్-1బీ వీసా హోల్డర్లలో 72% మంది భారతీయులే.ఎల్1 వీసా హోల్డర్లలో కూడా చాలా మంది భారతీయులే ఉన్నారు.దీంతో ఈ కొత్త నిబంధన వల్ల ఎక్కువ నష్టపోయేది భారతీయులే.

Telugu Citizenship, Donald Trump, Executive, Green Backlog, Visa, Policy, Indian

ఈ కొత్త పాలసీపై సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పన్నులు కడుతూ, కీలకమైన రంగాల్లో పనిచేస్తూ అమెరికా అభివృద్ధికి తోడ్పడుతున్న తమకు ఈ పరిస్థితి ఎదురుకావడం అన్యాయమని చాలామంది వాపోతున్నారు.“అమెరికన్ డ్రీమ్” ఇప్పుడు చాలామందికి దూరమయ్యేలా ఉంది.ఈ కొత్త నిబంధన వల్ల తమ పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న భారతీయుల కలలు ఈ కొత్త వీసా నిబంధనలతో అడియాశలు అవుతున్నాయి.ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube