బీన్స్ లో అన్ని రకాల అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.అంతేకాకుండా మాంసాహారంలో ఉండే అమినో యాసిడ్స్ కంటే ఇందులో కాస్త ఎక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు.
వివిధ ఆకారాలు, రంగులు మరియు రుచులతో ఇవి మార్కెట్లో లభిస్తాయి.బీన్స్ రకంతో సంబంధం లేకుండా అన్నిటిలోనూ పోషకాలు దాదాపు ఓకే విధంగా ఉంటాయి.
గుండె ఆరోగ్యం నుంచి రోగనిరోధక శక్తి పెంచే వరకు బీన్స్ మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.బీన్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.
శరీరం నుంచి విష తొలగించడం మరియు రక్తాన్ని శుభ్రపరచడం వంటి అనేక జీవ ప్రక్రియకు ఇవి ఎంతో మేలు చేస్తాయి.అంతేకాకుండా ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి.
బీన్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది.ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.బీన్స్ రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది.బీన్స్ లోని కార్బోహైడ్రేట్స్ చాలా నెమ్మదిగా జీర్ణమవుతాయి.అందువల్ల రక్తంలో చక్కెర స్థాయి అంత త్వరగా పెరగదు.ఇవి ఎముకల ఆరోగ్యానికి శరీరానికి అవసరమైన రోజువారీ కాల్షియం అందించి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
బీన్స్ లో ఉండే అనేక సమ్మేళనాలు మరియు నిరోధకాలు కూడా క్యాన్సర్ ను నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.బీన్స్ లోని ప్రోటీన్ మాంసంలో ఉండే ప్రోటీన్ తో దాదాపు సమానంగా ఉంటుంది.బీన్స్ తినడం వల్ల గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది.ఆరోగ్యకరమైన బిడ్డ ఎదుగుదలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.బీన్స్ లో ఫైబర్ మరియు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల కొవ్వు తక్కువగా ఉంటుంది.ఇవి బరువును కూడా అదుపులో ఉంచుతాయి.