తారకరత్న, అల్లు అర్జున్ విషయంలో ఎటు తేల్చుకోలేకపోయినా స్టార్ డైరెక్టర్.. కానీ చివరికి?

తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.నందమూరి హీరో తారకరత్న తాజాగా శనివారం రోజున తుది శ్వాస విడిచిన విషయం మనందరికీ తెలిసిందే.

 Here Is Why Raghavendra Rao Did Not Launch Tarakaratna Details, Tarakaratna, Rag-TeluguStop.com

గత 23 రోజులుగా బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న మృత్యువుతో పోరాడి చివరికి ఓడిపోయారు.వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ తారకరత్న ని కాపాడలేకపోయారు.

తారకరత్న మరణంతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే నందమూరి ఫ్యామిలీలో విషాదఛాయలు అలముకున్నాయి.నందమూరి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

తారకరత్న మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

తారకరత్న ఆరోగ్యంగా కోలుకుంటాడు అనుకున్నాం కానీ ఇలా మరణిస్తాడు అనుకోలేదు ఇదంతా కలల జరిగిపోయింది అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే తారకరత్న అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆయన జ్ఞాపకాలను సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు.ఇక తారకరత్న అప్పట్లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా ఆ సినిమా గురించి ఉమ్మడి రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంది.

ఇకపోతే ఆ సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన 100వ సినిమాకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.అయితే ఇండస్ట్రీలోని టాప్ హీరోతో 100వ సినిమా చేయాలి అన్నది రాఘవేంద్రరావు కోరిక.

Telugu Allu Arjun, Raghavendra Rao, Okatonumber, Tarakaratna, Tollywood-Movie

ఆ సమయంలో తారకరత్న తండ్రి నందమూరి మోహనకృష్ణ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుని సంప్రదించి 100 సినిమాగా తన కొడుకు తారకరత్న లాంచ్ చేయాలి అని కోరగా, అప్పుడు అల్లు అరవింద్ కూడా తన కొడుకు అల్లు అర్జున్ ని లాంచ్ చేయమని రిక్వెస్ట్ చేశారు.అలా దర్శకేంద్రుడు 100వ సినిమా విషయంలో చాలా రోజులపాటు చర్చలు కొనసాగాయి.ఎటు తేల్చుకోలేని పరిస్థితులలో రాఘవేంద్రరావు అల్లు అర్జున్ సినిమాకు ఓకే చెప్పారు.వెంటనే మోహనకృష్ణ నచ్చుకోకుండా తారకరత్న సినిమాకు తాను సపోర్ట్ చేస్తానని, తారకరత్నకు తగ్గ కథను ప్రిపేర్ చేయిస్తాను సమర్పకుడిగా ఉంటాను అని మాట ఇచ్చారు.

Telugu Allu Arjun, Raghavendra Rao, Okatonumber, Tarakaratna, Tollywood-Movie

కానీ దర్శకుడిని మాత్రం మీరే తెచ్చుకోండి అనే మోహన కృష్ణకు తెలపగా అప్పుడు మోహనకృష్ణ తన సోదరుడు బాలకృష్ణ సలహా అడిగారు.అప్పుడు బాలకృష్ణ బి.గోపాల్ సింగీతం శ్రీనివాసరావు ఎవరైనా ఒకరిని ఎంచుకోవాలని సూచించగా అప్పుడు వారిద్దరూ కొన్ని కారణాలు చెప్పి ఎన్నో అనే చెప్పారు.తర్వాత మళ్లీ రాఘవేంద్ర రావు ని సలహా అడగగా కోదండరామిరెడ్డిని సూచించడంతో ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రం కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube