ఆ కారణంతోనే నరేష్ పవిత్ర ప్రేమలో పడ్డారా... ఇన్ని రోజులకు బయటపడిన నిజం?

సినీ ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించి అనంతరం కమెడియన్ గా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో సీనియర్ నటుడు నరేష్ (Naresh) ఒకరు.ప్రస్తుతం ఈయన పలు సినిమాలలో తండ్రి పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

 Naresh Reveals Interesting Facts About Pavitra Lokesh, Naresh, Pavitra Lokesh,-TeluguStop.com

ఇక పోతే నరేష్ వ్యక్తిగత విషయానికి వస్తే ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.అయితే తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చారు.

నటి పవిత్ర లోకేష్ ( Pavitra Lokesh ) తో రిలేషన్ లో ఉన్నటువంటి ఈమె తనతో కలిసి కొత్త జీవితం ప్రారంభించారు.ఈ క్రమంలోనే ఎన్నో వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి.

ఇకపోతే తాజాగా పవిత్ర లోకేష్ తన ప్రేమ గురించి నరేష్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.చాలామంది నా డబ్బు కోసమే పవిత్ర నన్ను ప్రేమిస్తోందంటూ కామెంట్లో చేశారు.అందులో నిజం లేదని తెలిపారు.పవిత్ర పుట్టినరోజు మా అమ్మ విజయనిర్మల( Vijaya Nirmala ) పుట్టినరోజు ఫిబ్రవరి 20వ తేదీ.అమ్మ నా పట్ల ఎలాగైతే ప్రేమాభిమానాలు చూపించేదో పవిత్ర కూడా అలాగే చూపించేదని తెలిపారు.

మా అమ్మ ఎప్పుడు బాధపడుతూ ఉండేది నీకు అన్నీ ఇచ్చాను కానీ మంచి పార్ట్నర్ ని ఇవ్వలేదని బాధపడేది కానీ పవిత్ర నా జీవితంలోకి వచ్చిన తర్వాత అమ్మ నడవలేని స్థితిలో బెడ్ పై ఉండగా తన వద్దకు వెళ్లి అమ్మ నువ్వు కంగారు పడకు అమ్మలా చూసుకునే అమ్మాయి నా జీవితంలోకి వచ్చిందని తనకు చెప్పాను.పవిత్ర కూడా అచ్చం మా అమ్మలాగే స్ట్రాంగ్ ఉమెన్ అంటూ పవిత్ర లోకేష్ వ్యక్తిత్వం పై ఆమె ప్రేమ గురించి నరేష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube