గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికి తెలిసిన విషయమే.ఒకప్పుడు గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని ఒక అపోహ ఉండేది.
అది ఎంత మాత్రం నిజం కాదు.ఇప్పుడు ఒక వారం పాటు ప్రతి రోజు మూడు గుడ్లను తింటే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు గురించి వివరంగా తెలుసుకుందాం.
గుడ్డులో మన శరీరానికి అవసరమైన గుడ్డులో విటమిన్ ఎ, ఇ, బి6, బి12, థైమిన్, రిబోఫ్లావిన్ ఫొల్లెట్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, సెలీనియం మరియు ఇతర న్యూట్రీషియన్స్ సమృద్ధిగా ఉంటాయి.
గుడ్డులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది.
ఇది మన శరీరం మరియు మెదడుకు అవసరం.ప్రతి కణం స్థిరంగా ఉండటానికి మంచి కొలెస్ట్రాల్ అవసరం.
అంతేకాక శరీరంలో టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజెన్, మరియు కార్టిసోల్ హార్మోన్స్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
గుడ్డులో కొలిన్ సమృద్ధిగా ఉండుట వలన మెదడు అభివృద్ధి బాగుంటుంది.
మతిమరుపు రాకుండా మెదడు పనితీరు బాగుంటుంది.
గుడ్డులో లూటిన్ మరియు జియాక్సిథిన్ , కెరోటినాయిడ్ విటమిన్స్ సమృద్ధిగా ఉండుట వలన కంటి చూపును మెరుగుపర్చటంలో చాలా బాగా సహాయపడుతుంది.
అంతేకాక వయస్సు రీత్యా వచ్చే కంటి సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.

ప్రతి రోజు మూడు గుడ్లను తినటం వలన గుడ్డులోని తెల్లసొన మజిల్స్ పెంచటంలో సహాయపడుతుంది.అందువల్ల రోజుకి మూడు గుడ్లను తినటం వలన ఎటువంటి నష్టం లేకుండా ఆరోగ్యానికి మంచిది.
గుడ్డులో కాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉండుట వలన ఎముకలకు బలాన్ని ఇచ్చి వయస్సు రీత్యా వచ్చే ఎముకల సమస్యలకు పరిష్కారం చూపుతుంది.
గుడ్డును ఉదయం అల్పాహారంగా తీసుకోవటం వలన కడుపు నిండిన భావన ఉంటుంది.దాంతో రోజులో ఎక్కువ ఆహారం తీసుకొనే అవకాశం ఉండదు.దాంతో బరువు తగ్గుతాం.
మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న గుడ్డును ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకొని ఆ తేడాను మీరే గమనించండి.