శిరస్సులేని అమ్మవారి ఆలయం గురించి మీకు తెలుసా..?

శిరస్సు లేని అమ్మవారి ఆలయం విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం సమీపంలో ఉన్న దొండపర్తిలో ఉంది.అయితే సాధారణంగా మనం గుడిలో దేవతకు ముఖ్య సమయంలో అమ్మవారు( Goddess ) విగ్రహం వైపు చూస్తూ మొక్కుతూ ఉంటాం.

 Interesting Facts About Headless Goddess Erukumamba Ammavaru Temple Details, Int-TeluguStop.com

కానీ ఈ గుడిలో మాత్రం అమ్మవారు విగ్రహానికి శిరస్సు( Head ) ఉండదు.అయితే శిరస్సు స్థానంలో ఓంకారం ఉంటుంది.

ఆలయంలో కొలువైన అమ్మవారి పాదాల దగ్గర శిరస్సు ఉంటుంది.ఇక ఈ అమ్మవారికి కేవలం బిందెడు పసుపు నీళ్లను సమర్పించుకుంటే చాలు, భక్తులు కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్చేస్తుందని నమ్ముతారు.

ఈ స్థలంలో అమ్మవారు మూడో దశాబ్దంలో వెలసినట్టు అక్కడి వాళ్ళు చెబుతున్నారు.

Telugu Bhakti, Devotional, Gowri Devi, Temple, Turmeric, Vishakapatnam-Latest Ne

అయితే కేవలం విశాఖ( Vishakapatnam ) వాసులే కాకుండా ఉత్తరాంధ్రలోనే సత్యం చెప్పే తల్లిగా ఈ ఏరుకుమాంబ అమ్మవారిని( Erukumamba Ammavaru ) ఎంతోమంది భక్తులు కొలుస్తారు.అయితే ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు వేరే వేరే ప్రాంతాల నుండి ఎంతోమంది భక్తులు తరలివస్తూ ఉంటారు.అయితే ఇక్కడ కొలువు ఉన్న అమ్మవారి వెనుక భాగంలో శ్రీ చక్రం ఉందని కూడా భక్తులు చెబుతారు.

ఇక ఈమెను గౌరీ స్వరూపినిగా( Gowri Devi ) కూడా భావిస్తారట.అయితే ఒకప్పుడు రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న వైర్లెస్ కాలనీలో ఈ అమ్మవారికి పూజలు చేసేవారు.

అక్కడే ఈ అమ్మవారి ఆలయం నిర్మించి పూజలు చేసేవారట.

Telugu Bhakti, Devotional, Gowri Devi, Temple, Turmeric, Vishakapatnam-Latest Ne

ఇక గౌరీ స్వరూపమైన ఈ అమ్మవారి విగ్రహాన్ని ఎద్దుల బండి మీద ఆలయం మార్చేందుకు తీసుకొస్తున్నప్పుడు బండి ఆగిన చోట అమ్మవారికి ఆలయం నిర్మించాలని అప్పట్లో పెద్దలు నిర్ణయించుకున్నారు.ఇక ఆ సమయంలోనే అమ్మవారి విగ్రహం నుండి శిరస్సు వేరు అయ్యింది.అలా వేరుపడిన శిరస్సును అతికించేందుకు ప్రయత్నించినా కూడా అసలు సాధ్య పడలేదు.

ఇక అప్పుడు భక్తులు అమ్మవారిని వేడుకోగా తన కాళ్ల దగ్గరే శిరస్సు పెట్టి కంఠం దగ్గర పసుపు నీళ్లు పోస్తే చాలు అని, మీకు చల్లని దీవెనలు అందిస్తానని చెప్పారని భక్తులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube